మనం
ఒక చలనం... ఒక జ్వలనం
రెండూ ఉన్నాయి.. నాలోనూ నీలోనూ..
కళింగ యుద్ధం నుండి,
కాకరాపల్లి వరకూ..
మనదెప్పుడూ చైతన్య నినాదమే
సమరనాదాల శంఖారావమే.
కళింగ యుద్ధం నుండి,
కాకరాపల్లి వరకూ..
మనదెప్పుడూ చైతన్య నినాదమే
సమరనాదాల శంఖారావమే.
అయినా..
మనం ఎప్పటికీ అంతే
"మనం" గా మిగలం
మనసులో గింజుకుంటూ మాటల్లో పెగలం.
ఘోషించే నీ గొంతుకు నేను
రోదించే నా మనసుకు నువ్వూ..
విమర్శల ఉరి తాడు బిగిస్తాం..
మనం ఎప్పటికీ అంతే
"మనం" గా మిగలం
మనసులో గింజుకుంటూ మాటల్లో పెగలం.
ఘోషించే నీ గొంతుకు నేను
రోదించే నా మనసుకు నువ్వూ..
విమర్శల ఉరి తాడు బిగిస్తాం..
అందమైన భాషా ప్రయోగాలు చేస్తూ,
మౌనంగా అరిచే అవ్యక్తులమవుతాం.
మనం అనుకుంటాం కానీ
ఎప్పటికవుతాం "మనం" ???
మౌనంగా అరిచే అవ్యక్తులమవుతాం.
మనం అనుకుంటాం కానీ
ఎప్పటికవుతాం "మనం" ???
వేనవేల చీలికలు తునాతునకలవుతూ
మనతోటి కణాలను మనమే చంపుకునే
వైరస్‌లం...
మనతోటి కణాలను మనమే చంపుకునే
వైరస్‌లం...
మనం అంతే..
ఎప్పటికీ కురియని మేఘాలం..
గడ్డకట్టిన దుఃఖాలం..
తీరం దాటని మౌన సముద్రాలం
తోటి వారిని వినలేని బధిరులం
అభిప్రాయాలకు అడ్డుకప్పిన ఘోషాలం..
ఎప్పటికీ కురియని మేఘాలం..
గడ్డకట్టిన దుఃఖాలం..
తీరం దాటని మౌన సముద్రాలం
తోటి వారిని వినలేని బధిరులం
అభిప్రాయాలకు అడ్డుకప్పిన ఘోషాలం..
మనం...
మన మీదే తిరగబడే నీడలం.
వెలుతురులో సంచరించే చీకట్లం..
మనం ఎప్పటికీ "మనం" కాని మనం..
మన మీదే తిరగబడే నీడలం.
వెలుతురులో సంచరించే చీకట్లం..
మనం ఎప్పటికీ "మనం" కాని మనం..
- 21.09.15
Post a Comment