పసి నవ్వులు
మనసులో మంచులా ఉన్న పసితనం
మీ వెచ్చని నవ్వులతో కరిగి కరిగి ప్రవహిస్తోంది.
ఆ స్వచ్చతా ప్రవాహంలో
ఒక కాగితం పడవనై
అలా అలా తేలిపోతుంటాను..
మీ వెచ్చని నవ్వులతో కరిగి కరిగి ప్రవహిస్తోంది.
ఆ స్వచ్చతా ప్రవాహంలో
ఒక కాగితం పడవనై
అలా అలా తేలిపోతుంటాను..
పూల పరిమళాల పుస్తకం..
వడగళ్ళు దాచుకున్న డబ్బా
కోనేటి మెట్లూ..
కాకి ఎంగిలీ..
దాగుడుమూతా దండాకోర్
కొబ్బరాకుల బొమ్మల పెళ్ళీ...
నెమలీక జ్ఞాపకాలూ....
వడగళ్ళు దాచుకున్న డబ్బా
కోనేటి మెట్లూ..
కాకి ఎంగిలీ..
దాగుడుమూతా దండాకోర్
కొబ్బరాకుల బొమ్మల పెళ్ళీ...
నెమలీక జ్ఞాపకాలూ....
ఇసుకగూళ్ళు కట్టిన గర్వంలో
అంతో ఇంతో చిలిపితనం
కూసింత అమాయకత్వం
కాస్తంత పసితనం
మీ నవ్వుల్లో దాచి పెట్టి..
ఇలాగే అట్టిపెట్టుకోండి
అంతో ఇంతో చిలిపితనం
కూసింత అమాయకత్వం
కాస్తంత పసితనం
మీ నవ్వుల్లో దాచి పెట్టి..
ఇలాగే అట్టిపెట్టుకోండి
మీ పసి నవ్వులని వర్ణించేందుకు
ఒక కొత్త భాషగా మిమ్మల్ని చదువుకుంటూ
నన్ను నేనో లిపిగా మార్చుకుంటున్నా
ఒక కొత్త భాషగా మిమ్మల్ని చదువుకుంటూ
నన్ను నేనో లిపిగా మార్చుకుంటున్నా
మీ పసి నవ్వుల సాగర తీరాన్ని
అలలు అలలుగా హత్తుకోవాలనుంది..
మరి… ఎప్పటికప్పుడు
గుప్పెళ్ళ కొద్దీ మీ స్వచ్చమైన నవ్వు
ఇలా ఇలా... మాకివ్వరూ...
అలలు అలలుగా హత్తుకోవాలనుంది..
మరి… ఎప్పటికప్పుడు
గుప్పెళ్ళ కొద్దీ మీ స్వచ్చమైన నవ్వు
ఇలా ఇలా... మాకివ్వరూ...
Post a Comment