దృశ్యాదృశ్యం
ఈ లోకంలో మనసుల సడి ఇంకా సద్దుమణగలేదు
తరచుగా మనుషులు తిరుగుతూనే ఉన్నారు.
నీ చూపులే..,
వారిని అరుదుగా వెతుక్కుంటూ ఉంటాయి!!
ఏ పుట్టుకనీ ఎవరూ నిర్దేశించుకోని లోకంలో
వర్ణాల అంగడిలో కుత్తుకల లెక్కలు చూసుకుంటూ ..
తరచుగా మనుషులు తిరుగుతూనే ఉన్నారు.
నీ చూపులే..,
వారిని అరుదుగా వెతుక్కుంటూ ఉంటాయి!!
ఏ పుట్టుకనీ ఎవరూ నిర్దేశించుకోని లోకంలో
వర్ణాల అంగడిలో కుత్తుకల లెక్కలు చూసుకుంటూ ..
ఈ ప్రపంచమే ఒక తప్పుల తక్కెడని
ఇక్కడ జరుగుతున్న పొరపాట్లకి
తల బద్దలు కోవటం మానేయ్ మిత్రమా
మూసిన ప్రతి తలుపు వెనుక ఒక రాజీ మార్గం
దాగుంటుందని నువ్వు తెలుసుకునే వేళకి,
సమాజం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చూసి నెమ్మదించి
నువ్వు స్థిత ప్రజ్ఞత అలవరచుకునే వేళకి ...

నీ జీవితం నీకు సత్యాన్ని ఆవిష్కరిస్తుంది గానీ
బదులుగా నీ యవ్వనాన్ని పూర్తిగా లాక్కుంటుంది
ఏదో అనుకుంటాం కానీ క్షణాలని పట్టుకోవటం చాలా కష్టం సుమీ
అందులోనూ మనకంటూ మిగిలే ఆ కొన్నిటిని మరీ...
బదులుగా నీ యవ్వనాన్ని పూర్తిగా లాక్కుంటుంది
ఏదో అనుకుంటాం కానీ క్షణాలని పట్టుకోవటం చాలా కష్టం సుమీ
అందులోనూ మనకంటూ మిగిలే ఆ కొన్నిటిని మరీ...
-
15.10.15
Post a Comment