నువ్వు రద్దయిపోయినట్లే

మనిషనుకుని నీకు చెప్పే మాటలన్నీ 
చెవుల సరికద్దుల కావలే పోగుపడిపోతూ 
పశుత్వమొకటి రంకెలేస్తుందంటే
ఈ నేలపై
 
మనిషిగా నువ్వు రద్దయిపోయినట్లేనన్న
 
నిజం నీకు చేరే సమయమయ్యింది
నువ్వొక తిమిరమై నా లోకానికి 
కాటుక పూద్దామనుకున్నప్పుడల్లా
 
నా కళ్ళ అరుణమొకటి రణమై
 
గుండెలు మండుతున్న దృశ్యం...
సదృశ్యమై
 
మొలకెత్తిన చోటే నిన్ను ముగించడం
 
బహు సులువైన విషయమేనన్న ఎరుకలో కొనసాగిపో




No comments