జబ్ కోయి బాత్ బిగడ్ జాయే...
కొన్ని జ్ఞాపకాలంతే!
వెనక్కితిరిగి చూసుకుంటే
తేలుతున్న నీడలు తరుముతున్నట్లు..
పోగొట్టుకున్నదేదో అవ్యక్తంగా
తెరలమాటున పలకరిస్తూ ఉంటుంది.
వెనక్కితిరిగి చూసుకుంటే
తేలుతున్న నీడలు తరుముతున్నట్లు..
పోగొట్టుకున్నదేదో అవ్యక్తంగా
తెరలమాటున పలకరిస్తూ ఉంటుంది.
మరపు తీరాలలో జారిపోయిన కలల కోసం
ఎప్పటికీ వెతుకుతూనే ఉంటుంది మనసు..
గడియారపు ముల్లుని వెనక్కు జరిపి,
ఒక కాలం క్రితం జీవించిన జీవితాన్ని..
జ్ఞాపకాల వర్షం రాల్చిన ముత్యపు బిందువుల్ని
తడుముకుంటూనే ఉంటాను.
ఎప్పటికీ వెతుకుతూనే ఉంటుంది మనసు..
గడియారపు ముల్లుని వెనక్కు జరిపి,
ఒక కాలం క్రితం జీవించిన జీవితాన్ని..
జ్ఞాపకాల వర్షం రాల్చిన ముత్యపు బిందువుల్ని
తడుముకుంటూనే ఉంటాను.
కొన్ని జ్ఞాపకాలంతే!
తడిమిన ప్రతీసారీ
సగం తెగిన గుండె
నాది కాని పాట పాడుతూ ఉంటుంది.
రెప్పల కింద సముద్రం..
కెరటాలు కెరటాలుగా తీరం దాటుతుంది.
చెక్కిలి జారిన కన్నీటి చుక్క
మరచిన దానిని మళ్ళీ మళ్ళీ
.... జ్ఞాపకం చేస్తుంది.
తడిమిన ప్రతీసారీ
సగం తెగిన గుండె
నాది కాని పాట పాడుతూ ఉంటుంది.
రెప్పల కింద సముద్రం..
కెరటాలు కెరటాలుగా తీరం దాటుతుంది.
చెక్కిలి జారిన కన్నీటి చుక్క
మరచిన దానిని మళ్ళీ మళ్ళీ
.... జ్ఞాపకం చేస్తుంది.
కొన్ని జ్ఞాపకాలంతే!
మనుష్యుల మధ్య లెక్కలు నేర్పుతున్న
దూరాన్ని ఎప్పటికీ కొలవలేవు.
మబ్బుల శూన్యంలో వేలాడుతున్న మనసుల్ని
ఎప్పటికీ కలపలేవు.
మనుష్యుల మధ్య లెక్కలు నేర్పుతున్న
దూరాన్ని ఎప్పటికీ కొలవలేవు.
మబ్బుల శూన్యంలో వేలాడుతున్న మనసుల్ని
ఎప్పటికీ కలపలేవు.
మిత్రమా!!
ఈ వేలు మాత్రం విడువకూ...
ఏదో మర్చిపోయిన జ్ఞాపకం..
నిన్ను తడుముతూ ఉండాలిగా..
ఈ వేలు మాత్రం విడువకూ...
ఏదో మర్చిపోయిన జ్ఞాపకం..
నిన్ను తడుముతూ ఉండాలిగా..
మహీ..
11.09.2015.
11.09.2015.
Post a Comment