జోలపాట
రెప్పలు అంటుకోబడని చూపుల్లో
నిన్ను కొలుచుకున్నప్పుడూ
గుండె దాటని మౌనంలో
నిన్ను చదువుకున్నప్పుడూ
నిన్ను చదువుకున్నప్పుడూ
పెదవి అంచున నవ్వుల్లో
నువ్వు వెలుగుతున్నప్పుడూ
నువ్వు వెలుగుతున్నప్పుడూ
నా అస్తిత్వపు రహస్యంగా
నువ్వు పరిభ్రమిస్తున్నప్పుడూ
నువ్వు పరిభ్రమిస్తున్నప్పుడూ
ఎవరో జారవిడిచిన జాబిల్లిని పొదవుకుని
వెన్నెలవై నువ్వు నాపై కురిసినప్పుడూ
వెన్నెలవై నువ్వు నాపై కురిసినప్పుడూ
నిద్రను తాగేస్తున్న ప్రతీ కలగా
నువ్వే వచ్చినప్పుడూ
నువ్వే వచ్చినప్పుడూ
నన్నొక స్వార్ధంగా చేసుకుని
నువ్వు అల్లుకుపోయే క్షణం కోసం కొన్ని యుగాలైనా నిరీక్షిస్తూ
నువ్వు అల్లుకుపోయే క్షణం కోసం కొన్ని యుగాలైనా నిరీక్షిస్తూ
ఊపిరున్నంత వరకూ నాలో నువ్వై
ఒక జోలపాటగా నన్ను కమ్ముకుంటావని చూస్తున్నా
నీ గుండెలోతుల్లో వెచ్చగా నిద్రపుచ్చుతూ
ఒక జోలపాటగా నన్ను కమ్ముకుంటావని చూస్తున్నా
నీ గుండెలోతుల్లో వెచ్చగా నిద్రపుచ్చుతూ
Post a Comment