అల్లరి పూలు



నీ వాగ్ధాన పరిమళాలతో
నా హృదయం నిండి పోతోంది...
ఒంటరిగా నే పాడుకుంటున్న పాట
యుగళ గీతమౌతుందనీ మనస్సు చెప్తోంది!!!
వెలుగుని చీకటి తరిమే చోట..
గ్రీష్మం వెంట తగిలి వర్షం సమీపించే చోట..
తీరం లేని మహా సముద్రాన్ని స్వేచ్ఛగా..
 
మౌనంగా చూస్తూ నేను...
దూరం నుంచి వస్తున్నాయి అలలు..
నువ్వు పంపిన సందేశంతో కాబోలు!!
నా కళ్ళు తళుక్కుమనే సమయం
 
అకస్మాత్తుగా వస్తుందని నాకు తెలుసు..
త్రోవ పక్కన అల్లరి పూలు నిశ్శబ్దంగా తల వాల్చాయి!!
తగ్గుతున్న కాంతిలో సముద్రపు పక్షులు
వాటి గూటికి చేరుకుంటున్నాయి...
నువ్వెక్కడ నేస్తమా!!
చేయాల్సిన పనులు ఇంకా మిగిలున్నాయా???
-      31.07.15


No comments