విశ్వమంత ప్రేమ

చిరుగాలి ఊసుల్లో...
చిగురుటాకు కబుర్లలో..
ఎటు చూసినా నువ్వే..

మనసు కొమ్మలోంచి...
పసి చిగురు తొంగి చూసినట్లు..
మనసలికిడి!!!
ఇంతకీ నువ్వెక్కడ నేస్తం!!!

నువ్వే ఆకాశం, నువ్వే సముద్రం..
వెలుగూ నువ్వే.. చీకటీ నువ్వే..
సంతోషం నీదే, దుఃఖం నీదే...

నీ మనసుని సుస్వరాలతో..
పరిమళాల ఆలింగనంలో
ఇముడ్చుకునేది.. నీ మీద నీ ప్రేమే..

నీ ప్రేమ పంచడానికి,
అనంతాకాశం...
విస్తరించిన చోట!!!
నిర్మలమయిన ధవళ కాంతి
ప్రసరిస్తుంది..

అక్కడ పగలూ లేదు, రాత్రీ లేదు.
రూపం లేదు రంగూ లేదు..
అసలు మాట అనేదే లేదు..
ఉన్నదంతా ప్రేమే..
విశ్వమంత ప్రేమ!!!

-      19.07.14


No comments