ఆకలి
అది...
పెదవులు విప్పకుండా..
దవడలు కదలకుండా
తినే నాజూకు తిండిలా లేదు!!
పెదవులు విప్పకుండా..
దవడలు కదలకుండా
తినే నాజూకు తిండిలా లేదు!!
పావుతిని.. ముప్పావు వదిలేసిన
మా ఆకుల్నంతా తుడిచి తుడిచి..
పిసికి పిసికి.. పిడికిలినిండా పట్టి..
నోటికి అందిస్తున్న ముద్దకి...
ఆత్మగౌరవం ఆపాదిస్తున్నట్లుగా ఉంది!
మా ఆకుల్నంతా తుడిచి తుడిచి..
పిసికి పిసికి.. పిడికిలినిండా పట్టి..
నోటికి అందిస్తున్న ముద్దకి...
ఆత్మగౌరవం ఆపాదిస్తున్నట్లుగా ఉంది!
ఆకలికి అసలైన నిర్వచనం..
ప్రాణానికి... అన్నానికి ఉన్న
అసలైన అనుబంధం....
లోకానికి చాటిచెప్తున్నట్లు ఉంది!!
ప్రాణానికి... అన్నానికి ఉన్న
అసలైన అనుబంధం....
లోకానికి చాటిచెప్తున్నట్లు ఉంది!!
అరచేతుల్లో అన్ని ఉండీ...
జీవితం విలువ తెలీని ఈ తరానికి...
అతను విలువైన పాఠం
చెప్తున్నట్లు ఉంది!!
జీవితం విలువ తెలీని ఈ తరానికి...
అతను విలువైన పాఠం
చెప్తున్నట్లు ఉంది!!
Post a Comment