మనం

కారం పట్టుకున్న వేలిని...
కంట్లో పెట్టుకున్నట్లు....
కొన్నిసార్లు మన కన్నీటికి,
మనమే కారణం అవుతాం..
అసంకల్పితంగా కొన్ని..
ఇష్టం లేకపొయినా కొన్ని..
అసహాయంగా కొన్ని!!
అనుబంధాల్ని..
 
బంధాలుగా చేసుకొని...
మనసు ఎదురు తిరుగుతున్నా,
చిరునవ్వుల దుప్పటికప్పేసి..
ఆలోచనలు రేగకుండా..
బాధ్యతల బరువు పెట్టేస్తాం
మన జీవితానికి మనమే
చిక్కుముడి వేసుకుంటాం
ఏ ముడి పడడానికయినా
రెండుకొసలూ కావాలి
ఏ బంధం నిలవాలన్నా
రెండు మనసులూ కలవాలి
ఎప్పటికైనా "మనం" అంటే..
కేవలం మంచిగా మిగలడం కాదు!!
మనం అంటే మనసు చెప్పినట్లు వినడం...
మనం అంటే "మనం" గా మిగలడం..

-      13.11.14


No comments