అప్పుడప్పుడూ..


అప్పుడప్పుడూ బ్రతకాలి....
ప్రాణంతో కాదు.. జీవంతో!!
చాలా..చాలా ఇష్టంగా బ్రతకాలి..
అప్పుడప్పుడూ..
పువ్వుల మధ్య
వాటి పరిమళం మధ్య.. హాయిగా శ్వాస పీల్చాలి.
చెంగు చెంగున ఎగిరే చేప పిల్లల్లా..
తుళ్ళి తుళ్ళీ ఆడుకోవాలి..
అప్పుడప్పుడూ..
గుండెల్లో అలజడిని మృదువుగా జోకొట్టి..
హాయిగా నిద్రపోయే మంత్రమేదో నేర్చుకోవాలి.
ఒక వాన చుక్కలో సంగీతం..
ఉదయించే సూర్యుడిలో చల్లదనం..
గుండెల్నిండుగా నింపుకోవాలి.
అప్పుడప్పుడూ..
ఏ అక్షరంతోనూ..
 
ఏ భాషలోనూ చెప్పలేని..
అందమైన ఏకాంతంలో తళుక్కున మెరవాలి!!
రేర్ వ్యూ మిర్రర్ లో వెంటాడే జ్ఞాపకాలు..
అందనంత దూరం పరిగెత్తాలి
ఎప్పటికీ... ఎప్పటికీ..
నీలో ఉన్న.. "నిన్ను" ఇష్టంగా ప్రేమించాలి..
అప్పుడప్పుడూ...
బలవంతంగా కాక...
ఇష్టంగా బ్రతకాలి...

-      10.12.14


No comments