అంకురం

అందని సమానత్వం..
ఉట్టికి కట్టిన వల్లె తాడులా
తుపుక్కున తెగి పడుతుందని....
ఎక్కడో నేల మీద నిల్చుని..
ఎనాళ్ళీ తాపత్రయం???
ఎండిన ఇసుకలో.. చల్లటి నీళ్ళ కోసం..
కొనగోటితో చెలిమ తవ్వినట్టు,
సమాజం లో చెదిరిన గౌరవం కోసం
ఎన్నాళ్ళీ నిశ్శబ్ద వెతుకులాట???
అసహనం- అసహాయత
ఆత్మాభిమానం- అసమర్ధత
బొగ్గుల సంచీలో నిప్పురవ్వలా..
లోపల్లోపల ఎన్నాళ్ళీ అశాంతి??
అలవాటుపడ్డ దుఃఖాలతో
మొద్దుబారిన మనస్సుతో
మనచుట్టూ తాకితే తగిలేంత
దట్టమైన చీకట్లు కమ్మేసినా..
ఎన్నాళ్ళీ నిర్వేదం??
రాత్రి కూడా వేకువ కోసం చూస్తుంది!!
కాలి బూడిదైనా ఫీనిక్స్ పక్షి
లేచి నిలబడుతుంది...
అంకురమై ఆరంభిస్తేనే
ప్రశ్నించి నిలబడేది,
మౌనం బద్దలైతేనే..
హద్దులు చెరిగి పోయేది..!!!
-      26.09.14 




No comments