నేనంటే నేననీ...
ఇన్నాళ్ళూ
నువ్వంటే నేననీ...
నేనంటే నువ్వనీ అనుకున్నానా!!
మన మధ్య పెరిగిన ఈ నిశ్శబ్దం,
కొత్త రహస్యాలు చెప్తోంది..
మరింత స్పష్టంగా....
నాకు మాత్రమే వినిపించేట్టు
గాయపడ్డ మనసుకి
మందు పూస్తూ చెప్తోంది!
స్నేహమంటే ఇష్టమనీ,
ఇష్టమంటే బంధమనీ
బంధమంటే మాట అనీ..
మాట తప్పితే కన్నీరనీ...
ఇన్నాళ్ళూ గాల్లో కట్టిన మేడలు
పరిహాసంగా నాట్యమాడాక..,
ఇప్పుడు అర్ధం అయింది..
నువ్వంటే నువ్వనీ.. నేనంటే కేవలం నేననీ.
ఇప్పుడు కట్టుకుంటున్న పునాదుల సాక్షిగా..
ఇంక నువ్వేకాదు... ఇన్నాళ్ళూ
నా ఆత్మ విశ్వాసాన్ని కర్కశంగా
చీకటి ఖండాల్లో సమాధి చేసిన
నీ జ్ఞాపకాలు కూడా ఒకప్పటి నా గతమే..
నేనంటే నువ్వనీ అనుకున్నానా!!
మన మధ్య పెరిగిన ఈ నిశ్శబ్దం,
కొత్త రహస్యాలు చెప్తోంది..
మరింత స్పష్టంగా....
నాకు మాత్రమే వినిపించేట్టు
గాయపడ్డ మనసుకి
మందు పూస్తూ చెప్తోంది!
స్నేహమంటే ఇష్టమనీ,
ఇష్టమంటే బంధమనీ
బంధమంటే మాట అనీ..
మాట తప్పితే కన్నీరనీ...
ఇన్నాళ్ళూ గాల్లో కట్టిన మేడలు
పరిహాసంగా నాట్యమాడాక..,
ఇప్పుడు అర్ధం అయింది..
నువ్వంటే నువ్వనీ.. నేనంటే కేవలం నేననీ.
ఇప్పుడు కట్టుకుంటున్న పునాదుల సాక్షిగా..
ఇంక నువ్వేకాదు... ఇన్నాళ్ళూ
నా ఆత్మ విశ్వాసాన్ని కర్కశంగా
చీకటి ఖండాల్లో సమాధి చేసిన
నీ జ్ఞాపకాలు కూడా ఒకప్పటి నా గతమే..
-
18.11.14
Post a Comment