బొమ్మా బొరుసూ


ఆడపిల్లగా పుట్టకపోతే..
నేనూ ఇంకోలా ఆలోచించేదానేమో!!
ఇలా పుట్టడమే మంచిదయ్యింది...
అవమానమంటే అర్ధం అయింది.
అందర్నీ ప్రేమించడమూ తెలిసింది...
మా నిస్సహాయతకి జవాబు
దొరక్కపోవడమూ మంచిదే అయింది..
ఇప్పుడు నిరంతరాన్వేషణకి సరిపడా
సహనం వచ్చింది..
చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన
రామాయణం నా మంచికే..
చాకలి మాటలు విన్న రాముడా..
ఇష్టం లేకుండా చిటికిన వేలైన..
తాకని రావణుడా..
క్లారిటీ.. పూర్తిగా వచ్చింది..
ఇప్పుడు అమానుషం అంటే 
అర్ధం తెలిసింది..
సమాజంలో మన అస్తిత్వాలను,
దృఢపర్చుకోవాలనీ తెలిసింది..
హింస అణిచివేత..
అవమానాలకు మూలం తెలిసింది..
ఇప్పుడు పూర్తిగా అర్ధం అయింది
పలాయనం పరిష్కారం కాదనీ...
మృగాడా మరిచిపోకు
నువ్వూ నేనూ బొమ్మా బొరుసులమేనని 
మగువగా మేము మనలేనప్పుడు
నీ అంతర్ధానం ఘడియల్లో మాటేనని...
 -21.01.15



No comments