ప్రశ్న




తత్వశాస్త్రానికి మూలం ....
విప్లవాలకు ఊతం..
 
ఆవిష్కరణలకు బీజం
 
అంతరిక్ష అన్వేషణలకు కారణం ...
ఏమిటి? 
ఎందుకు?
ఎలా?
ఎవరు?
......అంటూ ఒక చిన్న ప్రశ్నే...
కార్ల్ మార్క్స్ ప్రశ్నించకపోతే!!!
చేగువేరా ప్రశ్నించకపోతే!!!
బుద్ధుడు... మహాత్ముడు...
న్యూటన్... ఎడిసన్...
ప్రశ్నించక పోతే
చరిత్ర మరోలా చదువుకునే వాళ్ళం...
మనం మరోలా బతికే వాళ్ళం!
జంతువు మనిషైన వైనం...
మనిషి గగనాన్నంటిన దినం...
ప్రశ్నతోనే కదా ఈ పరిణామ క్రమం!!
ఎండావానలకు చలించని..
బండరాళ్ళను తలపించే
మన మనుగడకు అర్థం
మనమే వెతుక్కోవడానికి
పేరుకుపోయిన దుమ్ముపొరలు దులిపి
అటక మీది పుస్తకం తీసినట్టు
మౌఢ్యం పొరల్లో మరుగైపోయిన
మన విజ్ఞతను వెలికితీయడానికీ
ఒక చిన్న ప్రశ్న చాలదూ...?
ప్రశ్న కు దూరంగా ఉండడం అంటే
అజ్ఞానాన్ని ఆస్వాదించటమే!!!
-      15.03.15 


No comments