కొత్త కాదు
మరచిపోవాలనుకున్నదేదో....
మరచిపోతే మరణిస్తాననుకున్నదేదో
తిరిగి తిరిగి వృత్తంగా జీవితాన్ని ఆవృతం చేస్తూ
మనసుపొరల్లో నింపాదిగా కదులుతున్న నదీపాయలా
మరచిపోతున్న జ్ఞాపకాలనీ
పిచ్చితనపు ఆశల్నీ
కత్తిలా గాయ పరుస్తోంది!!!
మరచిపోతే మరణిస్తాననుకున్నదేదో
తిరిగి తిరిగి వృత్తంగా జీవితాన్ని ఆవృతం చేస్తూ
మనసుపొరల్లో నింపాదిగా కదులుతున్న నదీపాయలా
మరచిపోతున్న జ్ఞాపకాలనీ
పిచ్చితనపు ఆశల్నీ
కత్తిలా గాయ పరుస్తోంది!!!
ఒకప్పుడు సున్నితమైన ప్రవాహంలా
అచ్చు అమ్మలా... నాన్నలా... ఉన్న జ్ఞాపకం
ఊహించలేని ఉప్పెనగా మారి
నా కన్నులకంటిన నవ్వుని ఛిద్రం చేస్తుంటే
ఇప్పుడది...
వర్షపు చుక్కలు
నేలని ఇష్టంగా హత్తుకున్న ప్రేమా..
మట్టికి చేసిన గాయమా..
అర్ధంకాని అయోమయం .
నాకిదేం కొత్తా కాదు
చివరిదిలే అన్న ధైర్యమూ లేదు
అచ్చు అమ్మలా... నాన్నలా... ఉన్న జ్ఞాపకం
ఊహించలేని ఉప్పెనగా మారి
నా కన్నులకంటిన నవ్వుని ఛిద్రం చేస్తుంటే
ఇప్పుడది...
వర్షపు చుక్కలు
నేలని ఇష్టంగా హత్తుకున్న ప్రేమా..
మట్టికి చేసిన గాయమా..
అర్ధంకాని అయోమయం .
నాకిదేం కొత్తా కాదు
చివరిదిలే అన్న ధైర్యమూ లేదు
-
13.08.15
Post a Comment