అప్పుడప్పుడూ ఏమౌతుందో ఏమో..



ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై!!!
ఆజ్ ఫిర్ మర్‌నే కా యిరాదా హై....
అప్పుడప్పుడూ ఏమౌతుందో ఏమో..
ఒక్క సారిగా జీవితం మారిపోతుంది..
అంతః గ్రహాలకు ఏమౌతుందో ఏమో
అద్భుతమైన భ్రమణ గీతం మొదలవుతుంది
ఏదో తెలియని ఉద్వేగం..
నరాలను పట్టికుదిపేస్తుంది.
ఎప్పటినుండి ప్రయత్నిస్తుందో తెలీదు..
అందమైన భావాల అల,
ఇసుక కుప్ప లాంటి గతాన్ని తుడిచేస్తుంది.
మనసు మూలల్లో యాధృచ్చికంగా 
కలిగిన స్పందన
అడ్డుగోడలని పెకిలించుకుని బయట పడాలని
 
విఫలయత్నం చేస్తుంది..
స్థాణువైన కాలం నుండి జలపాతాల
రాగం మొదలవుతుంది..
లోలోపలి భావాల ఉద్వేగం విస్ఫోటనంగా మారి..
మనిషిని కుదురుంచనివ్వదు.
ఇనాళ్ళూ నిచ్చెన కనబడినా
కాళ్ళు సహకరించని జీవితానికి,
అందుకోవాలనుకున్న ఆకాశమే..
చేతిలోకొచ్చి వాలుతుంది..
అప్పుడు....
మళ్ళీ జీవించాలనిపిస్తుంది..
ఇంక మరణించినా పరవాలేదనిపిస్తుంది..
ఆజ్ ఫిర్...జీనేకీ తమన్నా హై....
-      14.02.15


No comments