మనింట్లోనే


ఒకప్పుడు కొంగు పట్టుకుని
వేలాడిన చిట్టి చేతులు...
తినమని నోట్లో ముద్దలు
పెడతాయనుకుంటే.,
రూపాయిల కట్టలతో పాటు
అన్నీ పళ్ళెం లో పోసి
అమ్మ ముందు పెట్టేసి
హడావిడిగా మోసుకు పోతుంటాయి
సద్దె మూటల్ని కట్టుకుని...
కాంక్రీటు పిచ్చుక గూటిలో 
చుట్టూ జన సంద్రం...
పలకరించే మనిషి తప్ప!!!
తిరిగి వచ్చి నిమిషం కాకుండానే
రింగు రింగున మోగే సెల్‌ఫోనూ..
 
మాట్లాడదామని నోరు తెరిచేలోపు
న్యూసూ, సీరియల్సూ..
పొద్దున్ననుండీ మాట్లాడాలనుకున్న
ప్రవాహం కళ్ళనుండి కారుతుంటే..
నీకేం తక్కువ చేసానన్న
విసుగూ.. చిరాకూ
మానవ సంబంధాలన్నీ 
మనీ సంబంధాలేనన్న
కార్ల్ మార్క్స్ జోస్యాన్ని...
మనింట్లోనే నిజం చేసిన చేతలు!!!

-      29.07.14


No comments