నేస్తమంటే...

నేస్తమంటే...
తనెళ్ళాక కూడా మన మదిలో
తన నవ్వుల పూలు విచ్చుకోవాలి!
అదృశ్యంగా తన కంఠధ్వని
మనల్ని చుట్టుముట్టి నాట్యమాడాలి!
నేస్తమంటే...
ఉరుకుల పరుగుల జీవితంలో
అలసి సొలసి పడుకున్నప్పుడు...
తల నిమురుతూ.. తీపి కలలివ్వాలి.
ఒంటరినైనప్పుడు..
కలతతో కలవరింతల తీరాన్ని
 
తాకుతున్నప్పుడు...
తాను వేణు గానమవ్వాలి!!
నేస్తమంటే...
నిరాశలెదురైనపుడు,
నీరయిపోతున్నప్పుడు..
వెన్నుతట్టి ముందుకు నడిపే
ఆసరా అవ్వాలి!
నేస్తమంటే...
ఎంత దాచినా..
గతంపై ఎన్ని రంగులద్దినా
మనసుపై మొదటి పొర
తన జ్ఞాపకం కావాలి..
మనం ఎంత పరుగులు తీసినా
తెలిసీ ఎన్ని దారులు మారినా
అలసినప్పుడు తన జ్ఞాపకం..
చివరి మజిలీ కావాలి!!
నేస్తమంటే..
మిగుల్చుకోవడానికేమీ లేని
ఏళ్ళకేళ్ళ ప్రయాణం కన్నా...
మనల్ని మనిషిని చేసే తనతో ప్రయణం...
ఒక్క రోజైనా....
అదే జీవితం అవ్వాలి..

-      04.12.14 


No comments