మరో సంవత్సరం ముంగిట్లో


చక్రభ్రమణం త్వరత్వరగా పూర్తవుతుంటే..
లక్ష్యాలను నిర్దేశించుకుంటూ
నవ వసంతం కమ్ముకొస్తుంది!!
గడిచెళ్ళిపోయిన దానికి
గడవబోయేదానికి...
బేరీజులు మొదలు!
చేసిందేమీ లేకున్నా..
చేసేదేమీ లేకున్నా
చేయి చేయీ కలుపుకుంటాం
మరికొన్ని చేద్దాం.. అనుకుంటాం.
మళ్ళీ మరో రోజు,
ఇంకో సంవత్సరం...
మళ్ళీ మనముందుకు వస్తుంది..
కొత్త ఆశలను మోసుకొస్తూ..
పాత జ్ఞాపకాలను చెరిపేస్తూ...
మనం మాత్రం ఇలానే ఉంటాం..
ఇదే నిర్లిప్తత- ఇదే బానిసత్వం...
అస్సహాయత్వపు ముసుగులో
నిష్క్రియా పర్వాన్ని కప్పిపుచ్చే
నిరంతర ప్రయత్నం!!
నాలుగు రోడ్ల కూడలిలో
ఎప్పటికీ తెలియని గమ్యం....
ఆకాశ దీపం వెలుగుల క్రింద
శబ్దాలు ఛేదించలేని నిశ్శబ్దంలో 
మనల్ని మనం వినాలని చేసే ప్రయత్నం....
నిరంతరం మనల్ని ప్రేమించే
మనస్సు అంతరంగం...
ఎప్పటికైనా నిత్య అన్వేషకుడిలా
మార్చేస్తుంది!!
అప్పుడే నవ వసంతం లోని లక్ష్యాలు..
గమనం బాట పట్టి గమ్యాన్ని చేరుకుంటాయి..
 - 01.01.2015



No comments