జీవితం
సమాంతరపు రైలు పట్టాలం మనం !!
దూరానికా దగ్గరకా
ఎప్పటికీ తెలియని ప్రయాణం.
దూరానికా దగ్గరకా
ఎప్పటికీ తెలియని ప్రయాణం.
కొన్ని క్షణాలు ఆశల తెరలు…
అంతలోనే అగాధాల నిరాశలు !
అలలు అలలుగా ప్రశ్నలు కొన్ని
మన మధ్య సందేహ కెరటాలవుతూ..
నన్ను ప్రశ్నిస్తూ నువ్వు..
నిన్ను శోధిస్తూ నేను!
అంతలోనే అగాధాల నిరాశలు !
అలలు అలలుగా ప్రశ్నలు కొన్ని
మన మధ్య సందేహ కెరటాలవుతూ..
నన్ను ప్రశ్నిస్తూ నువ్వు..
నిన్ను శోధిస్తూ నేను!
చిక్కుముడులు విప్పుకుంటూ
అగాధాలు పూడ్చుకుంటూ..,
మనమధ్య దూరమే లేదని
కుదుటపడే లోపు
నా అస్థిత్వాన్ని నువ్వు...
నీ ప్రపంచాన్ని నేను..
మరల మరల ప్రశ్నించుకుంటూ
మరో నెర్ర..
అగాధాలు పూడ్చుకుంటూ..,
మనమధ్య దూరమే లేదని
కుదుటపడే లోపు
నా అస్థిత్వాన్ని నువ్వు...
నీ ప్రపంచాన్ని నేను..
మరల మరల ప్రశ్నించుకుంటూ
మరో నెర్ర..
భవిష్యత్తు ఎక్కడో శిఖరం మీద కనబడుతుంది
పడిలేసే ఆశకి దర్పణంలా
వాడి ప్రశ్నల వాలు మీద
విషాదపు నవ్వొకటి పెదవినంటుతూ..
పడిలేసే ఆశకి దర్పణంలా
వాడి ప్రశ్నల వాలు మీద
విషాదపు నవ్వొకటి పెదవినంటుతూ..
ఎప్పటికీ తరగని ఆత్మావలోకనం
సమాంతరపు రైలు పట్టాలమీద
మరో అతుకుని ఆహ్వానిస్తూ
మరో అగాధానికి చోటు చేస్తూ ...
సమాంతరపు రైలు పట్టాలమీద
మరో అతుకుని ఆహ్వానిస్తూ
మరో అగాధానికి చోటు చేస్తూ ...
-
05.06.15
Post a Comment