ఘర్ వాపసీ
మూలాలే తెలియనివాడికి...
ఏసయినా.. ఈశ్వరుడయినా తేడా ఏముంది??
కడుపు నింపే భరోసా ఇచ్చేవాడే అతనికి దేవుడు
నిన్న రాముడు
నేడు అల్లా..
రేపు…??
ఆ భరోసా నువ్వయితే,
ఆ దేవుడు నువ్వే కావచ్చు
ఏసయినా.. ఈశ్వరుడయినా తేడా ఏముంది??
కడుపు నింపే భరోసా ఇచ్చేవాడే అతనికి దేవుడు
నిన్న రాముడు
నేడు అల్లా..
రేపు…??
ఆ భరోసా నువ్వయితే,
ఆ దేవుడు నువ్వే కావచ్చు
ఘర్ వాపసీ ఓ అధ్బుతమంటున్నావ్!!
గడప దాటిన జీవితాలకి ...
పేవ్‌మెంట్ మీద దిగులు పరుచుకుని
పడుకునే ఊరుమ్మడి బతుకులు
ఏ ఇంటికి ఏతెంచాలి మరి!!!
గడప దాటిన జీవితాలకి ...
పేవ్‌మెంట్ మీద దిగులు పరుచుకుని
పడుకునే ఊరుమ్మడి బతుకులు
ఏ ఇంటికి ఏతెంచాలి మరి!!!
ఖాళీ కడుపుల నిండా
నీరింకిన కన్నులనుండి
ఆకలి ప్రవహించే ప్రాణాలకి…
అప్నా ఘర్.. ఎక్కడోయ్??
నీరింకిన కన్నులనుండి
ఆకలి ప్రవహించే ప్రాణాలకి…
అప్నా ఘర్.. ఎక్కడోయ్??
ఖాళీ కడుపుతో వలస వెళ్ళిన అభాగ్యులకు..
నువ్వు పిలిచిన "ఘర్ వాపసీ"
ఒక కలని పరుస్తుంది...
ఘర్ అంటే ఇల్లనీ..
ఇల్లంటే తమ మూలం అనీ..
ఆ ఘర్ లో తమ జానెడు పొట్టకి
పిడికెడు ముద్ద ఉండే నమ్మకపు
భరోసా ఇవ్వాలనీ
అంతకు మించి
బతుకుని దాటిన ఒక జీవితం ఉండాలనీ..
నువ్వు పిలిచిన "ఘర్ వాపసీ"
ఒక కలని పరుస్తుంది...
ఘర్ అంటే ఇల్లనీ..
ఇల్లంటే తమ మూలం అనీ..
ఆ ఘర్ లో తమ జానెడు పొట్టకి
పిడికెడు ముద్ద ఉండే నమ్మకపు
భరోసా ఇవ్వాలనీ
అంతకు మించి
బతుకుని దాటిన ఒక జీవితం ఉండాలనీ..
మరి
నీ పిలుపుకు...
సమాధానం నీకు వినిపిస్తోందా....
- 17.07.15
నీ పిలుపుకు...
సమాధానం నీకు వినిపిస్తోందా....
- 17.07.15
Post a Comment