మా అమ్మ నవ్వు..
వేయి వసంతాలు విరిసిన వెన్నెల వేళలో
పూసిన పున్నాగ లాంటి ఆ నవ్వు..
వెన్నలో ముంచిన కుంచెతో గీసిన
మెత్తటి ఆ నవ్వు...
మలయమారుతంలా నిలువెల్లా..
మనల్ని ప్రేమతో స్పృశించే నవ్వు!!
సెలయేటి సరిగమలలో స్వరం కలిపి
గల గలా పాడే తన నవ్వు..
అమృత వర్షంలా కురిసి
మనందరినీ సేదతీర్చే నవ్వు!!
పూసిన పున్నాగ లాంటి ఆ నవ్వు..
వెన్నలో ముంచిన కుంచెతో గీసిన
మెత్తటి ఆ నవ్వు...
మలయమారుతంలా నిలువెల్లా..
మనల్ని ప్రేమతో స్పృశించే నవ్వు!!
సెలయేటి సరిగమలలో స్వరం కలిపి
గల గలా పాడే తన నవ్వు..
అమృత వర్షంలా కురిసి
మనందరినీ సేదతీర్చే నవ్వు!!
ముద్ద మందారంలోంచి జారిన
పుప్పొడిలాంటి ఆనవ్వు...
మనసు చిలికిన
చందనంలాంటి..
ఒక చల్లని నవ్వు!!!
పుప్పొడిలాంటి ఆనవ్వు...
మనసు చిలికిన
చందనంలాంటి..
ఒక చల్లని నవ్వు!!!
-
05.05.15
Post a Comment