కొత్త బంగారు లోకం



నిన్న రాత్రి ఒక కల!!!
ఎత్తైన పర్వతం పై నేను
చేతులు చాస్తే అందేంత దూరం లో
అనంత మైన నీలాకాశం
చుట్టూ పచ్చని ప్రకృతి..
మనసంతా తెలియని ప్రశాంతత!!
ఇప్పుడు ఏ భయం లేదు..
ఎలాంటి వేదనా లేదు
మనసు లోని దుఃఖాన్ని
అగాధపుటంచుల్లోకి నెట్టేసి..
విశ్వమంత ప్రేమని
మనసంతా నింపుకుని..
చూస్తున్నా...
కొత్త బంగారు లోకాన్ని!!!!

No comments