భరోసా
తను పుట్టాకే తెలిసింది
నాకో ఉనికి ఉందని..
తనకోసం కనే కలలు సెలయేటి
పాటగా వినబడుతున్నప్పుడు...
చిక్కని చీకటిని చీల్చుతూ
ధృవనక్షత్రంలా తాను మెరిసినప్పుడూ..
వెలుగు వారధిని పరిచయించి..
నా బతుకు కోటకి ధైర్య ప్రాకారం
అయినప్పుడు..
అప్పుడు అర్ధం అయింది...
పూలకీ రెమ్మలు పూస్తాయని..
ఇప్పుడు నా గమ్యం తనే..
నా భరోసా తనే..
-
18.05.15
Post a Comment