నువ్వూ నేనూ



నాకు నేను తెలియక ముందే
నేను నీ దానిని
మరి నువ్వేమో నా ఆత్మవి
అయినా ఒకరికొకరం ఎడతెగని అహాలం
ఇది నిజం… ఇదే నిజం
యుగకర్తల క్రీడలతో
ఎక్కడెక్కడికో విసరబడితేనేం
ఎన్నెన్ని ఆనందాలతో భ్రమపెడితేనేం
ఒక నిశ్శబ్దం ఆక్రమించుకున్న తోటలో
పుట్టక ముందే
ఒక్కటైన ఆత్మల సంయోగస్వరం
మనకోసమంటూ వేచి ఉన్నాక
ప్రతి ఉదయం ఒకరి కళ్ళల్లో ఒకరం
వెలుగై ప్రభవించటంకోసం
ఆత్మైక్యం అవ్వడాన్ని ఆపటం ఎవ్వరి తరం



No comments