తలపుల తోవ

ఒక సంవత్సరం ఖలీల్ గిబ్రాన్ (ప్రొఫెట్),
మరోసారి చలం (గీతాంజలి) 
ఇదిగో ఈ సారి ఈ అద్భుతమైన పుస్తకం...."తలపుల తోవ"
పూల పడవ ఎక్కించి ఎర్రటి అరణ్యంలోకి తీసుకెళ్తోంది!!
Thanks for the wonderful and precious RAKHI GIFTS Sir.
Thanks a Ton
''నా రాత్రులన్నీ చంద్రుడి కోసం తపన
నీ కనుబొమ మీద ఒట్టు, నువ్వే ఆ చందమామ
ఒక పువ్వుకోసం వెతుకుతూ తోటలన్నీ తిరిగాను
ఎర్రబారిన నీ కనుబొమ మీద ఒట్టు, నువ్వే ఆ పువ్వువు
నా కవిత ఒక మాంత్రికగీతం కోసం అన్వేషించింది
సమ్మోహనపరిచే నీ చూపుల్లో ఆ గీతం నాకు దొరికింది
***
ఎవరి యవ్వనం వేదనకు ప్రతిరూపమో
ఆ నా నెచ్చెలి నా రక్షణ
తన నిట్టూర్పులను ఒక చిరునవ్వు వెనుక దాచేస్తుంది
నన్ను ప్రమాదం నుంచి కాపాడుతుంది
నేను తనకు విచారం తప్ప 
మరేమీ ప్రతిఫలం ఇవ్వకపోయినా...''
షౌకత్‌ ఖానుమ్‌ కోసం కైఫీ అజ్మీ 
(తలపుల తోవ పుస్తకం నుంచి)


No comments