రష్యన్ జానపద కధలు!!

రష్యన్ జానపద కధలు!!

నాకు చాలా ఇష్టమైన ఒకానొక రష్యన్ పుస్తకం ఒక అడుగు దూరంలో అలా ఊరిస్తూ ఉంటుందా... ఈ లోపు ఒక గంభీరమైన కంఠం స్పష్టం గా చెబుతుంది. " ఆ పుస్తకం అనిల్ కోసం!!" అని.

మనకి ఎలా ఉంటుంది చెప్పండి. ఈర్ష్యా, అసూయా.. .. ఎట్సెట్రా ఎట్సెట్రా లతో వళ్ళు మండి పోతూ ఉంటుంది. అయినా మనం బయట పడం కదా... 

"నిజమే అంకుల్! నా దగ్గర ఉంటే పెద్దగా ఏం ఉపయోగం. అనిల్ అయితే పదిమందికీ చేరుస్తాడు." అని నవ్వుతూ వచ్చేయడం. ప్రాచీనాంధ్ర గ్రంధమాలకి వెళ్ళినప్పుడల్లా ఇదే రిపీటెడ్ స్టోరీ.

అలా ఏదో లౌక్యంగా ఉండ బట్టి కదా... రష్యన్ పుస్తకాలు కొన్ని అనిల్ కి ఇచ్చినా నాకోసం ఆయన చాలా దాచి ఇచ్చింది.

అయినా అనిల్ అంటే నాకు కొంచం అసూయ. అనిల్ పుస్తకాల పిచ్చంటే మాత్రం బోలెడంత ప్రేమ. అసలు ఏ విషయం మీదైనా ఇంత పేషన్ ఉండే మనుష్యులంటే నాకు పిచ్చి ఇష్టం.


అందుకే తను పుస్తకం పంపుతా అనగానే చేరే వరకూ ఆశక్తిగా ఎదురు చూసాను. 


పైన నీలాకాశం.. మిల మిలా మెరుస్తున్న నక్షత్రాలు. కింద ఒక అందమైన సీతాకోక చిలుక.. వీటి మధ్యలో స్వేచ్ఛగా ఎగురుతున్న ఒక పసి తనం. పుస్తకం ముట్టుకోగానే చిన్నప్పుడు చందమామని తెరుస్తున్న స్పర్శ.
అదే ఫీలింగ్.. 


ఇరవై కధలు. 


ప్రతీ కధకీ ఒక అందమైన బొమ్మ.
ఇంగ్లీషులో కధ పేరు. మూల రచయిత పేరు.
క్లుప్తంగా రచయిత వివరాలు...
భలే ఉంది. చదవడానికి.
అన్నీ బుల్లి బుల్లి కధలు. కధల చివర్లో ఒక బుల్లి నీతి సూత్రం. అంటే కధలో చెప్పదలచుకున్న జిస్ట్ ఒక్క మాటలో అన్నమాట. 


నాకయితే చాలా చాలా నచ్చేసింది. చిన్న పిల్లలకి బెడ్ టైం పుస్తకంగా చాలా బాగుంటుంది.


పుస్తక ప్రపంచంలోకి వాళ్ళని లాక్కెళ్ళడానికి ఇది ఒక ఫౌండేషన్ గా కూడా ఉంటుంది.


నాకయితే రెండు రోజులనుంచి ఉడుతలూ, పిచ్చుకలూ, సీతాకోక చిలుకలూ బోలెడు కబుర్లు చెబ్తున్నాయి.



తోట కనిపించగానే ఏడురంగుల పువ్వు వెతుక్కుంటున్నా..
మీరూ చదవండి. పూలూ, పక్షుల ప్రపంచంలో విహరించండి.
ధాంక్యూ వెరీ మచ్ ఫర్ ద లవ్లీ బుక్ అనిల్!!




No comments