ఫనా..
ఫనా..
ఇదిగో ఇలా ప్రతీ క్షణం నీ నడకల సవ్వడి
మనసుకి చేరుతూనే ఉంటుంది.
అయినా కాలు కదపలేని అశక్తత నాది…
ఇదిగో ఇలా ప్రతీ క్షణం నీ నడకల సవ్వడి
మనసుకి చేరుతూనే ఉంటుంది.
అయినా కాలు కదపలేని అశక్తత నాది…
రెల్లు గడ్డి తలలూపుతూ చెప్తున్న ప్రతీ కబురూ
నీ గొంతు గలగలలను...
గుర్తు తెస్తూనే ఉంటుంది.
గాలి తిమ్మెరలు మోసుకొచ్చే ప్రతీ స్పర్శా
నీ జ్ఞాపకాన్ని తట్టి లేపుతూనే ఉంటుంది.
ఎపుడెపుడు నిన్ను కలుస్తానా అని
నా అణువణువూ తపన పడుతూనే ఉంటుంది.
నీ గొంతు గలగలలను...
గుర్తు తెస్తూనే ఉంటుంది.
గాలి తిమ్మెరలు మోసుకొచ్చే ప్రతీ స్పర్శా
నీ జ్ఞాపకాన్ని తట్టి లేపుతూనే ఉంటుంది.
ఎపుడెపుడు నిన్ను కలుస్తానా అని
నా అణువణువూ తపన పడుతూనే ఉంటుంది.
ఇదిగో…
కలల నెమలి రెక్కల్ని విదిలించుకుంటూ
సృష్టి చివరి కొన వరకూ మన ఊపిర్లని అల్లెయ్యడానికి
అప్పటి కొన్ని ఘడియలు
ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాయి .
నీకూ నాకూ మధ్య
కాలమెప్పుడూ లోలకమేనని చెబుతూ
ఇదిగో.. ఈ గుల్మొహర్ అందంగా తల ఊపుతోంది
కలల నెమలి రెక్కల్ని విదిలించుకుంటూ
సృష్టి చివరి కొన వరకూ మన ఊపిర్లని అల్లెయ్యడానికి
అప్పటి కొన్ని ఘడియలు
ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాయి .
నీకూ నాకూ మధ్య
కాలమెప్పుడూ లోలకమేనని చెబుతూ
ఇదిగో.. ఈ గుల్మొహర్ అందంగా తల ఊపుతోంది
ఏ తెల్ల పావురమో కనిపించినప్పుడల్లా
ఎంత ఆశగా దానికేసి చూస్తానో తెలుసా
తన ముక్కునో… కాలుకో
నువ్వు కట్టిన
ఎంతటి చిన్ని కాగితమైనా కనిపిస్తే లాగేసుకుందామని
మరి… అది నీ మనసు కదా
ఎంత ఆశగా దానికేసి చూస్తానో తెలుసా
తన ముక్కునో… కాలుకో
నువ్వు కట్టిన
ఎంతటి చిన్ని కాగితమైనా కనిపిస్తే లాగేసుకుందామని
మరి… అది నీ మనసు కదా
ఓ నేస్తమా...
ఇప్పటికి తెలిసిందా నా కన్నీటి తడి నీకు
ఇదిగో ఈ గాలి నా మొర నీకు చేరవేసినట్లుంది
సుడులు తిరిగి నాట్యం చేస్తూ ఇటువైపు వస్తోంది.
నాలో ఐక్యం అవడానికే ఇలా వచ్చ్చేస్తున్నావా
ఇప్పటికి తెలిసిందా నా కన్నీటి తడి నీకు
ఇదిగో ఈ గాలి నా మొర నీకు చేరవేసినట్లుంది
సుడులు తిరిగి నాట్యం చేస్తూ ఇటువైపు వస్తోంది.
నాలో ఐక్యం అవడానికే ఇలా వచ్చ్చేస్తున్నావా
రా మరి..
ఇక్కడొక చిన్ని ప్రాణం నీ కోసం ఎదురుచూస్తోంది
ఆకాశం నుండి నిండుగా ఆశీర్వాదాన్ని తీసుకుని
నా శూన్యంపై నీ చిరునవ్వుని కప్పుకుంటూ
ఇలా ఫనా అయి ఉనికిని కోల్పోవడానికీ
ఇక్కడొక చిన్ని ప్రాణం నీ కోసం ఎదురుచూస్తోంది
ఆకాశం నుండి నిండుగా ఆశీర్వాదాన్ని తీసుకుని
నా శూన్యంపై నీ చిరునవ్వుని కప్పుకుంటూ
ఇలా ఫనా అయి ఉనికిని కోల్పోవడానికీ
Post a Comment