అనుక్షణికం !!

అనుక్షణికం !!

ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఒక దశాబ్దం పాటు జరిగిన వివిధ పరిణామాల నేపధ్యంలో ఆయా పాత్రల జీవితాలు ఎలా పరిణమించాయో చెపుతుందీ నవల.

హిమజ్వాల, చీకట్లోంచి చీకట్లోకి.. చదివాక అనుక్షణికం, కూడా చదవమని మిత్రులు సలహా ఇస్తే అప్పటినుంచీ ఎదురు చూస్తున్న నవల. మధ్యలో చాలా సార్లు జగన్మోహన రావు గారి (ప్రాచీనాంధ్ర గ్రంధమాల) వెంట పడ్డా ఈ పుస్తకం కోసం. అప్పటికీ ఆయన చెప్పారు. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో చదవకండీ. చాలా సహనం కావాలి అని.

మనం వింటేనా... నా సహనం మీద నాకు అంత నమ్మకం మరి. పుస్తకం చదవడం ఇంకా పూర్తికాలేదు. ఈ మధ్యకాలం లో ఇన్ని ఇంటర్వెల్స్ ఇచ్చి చదువుతున్న పుస్తకం బహుశా ఇదే కావచ్చు.

ముందుగా బాగా నచ్చిన విషయం అయితే ఉస్మానియా వర్ణన. ఎంత బాగా నచ్చిందంటే ఉస్మానియాలో చేరి ఏదో ఒక కోర్స్ చేస్తే బాగుండు.. అనేంత.

ఇప్పటికి మూడు చాప్టర్స్ పూర్తి చేసాను. ఇంకా ఒక దాని తర్వాత మరొకటి.. చీమల పుట్టలా పాత్రలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.. అమ్మో ఇన్ని పాత్రలా.!! ఒక్కోసారి పాత్ర పేరు మర్చి పోయి మళ్ళీ వెనక పేజీలు చూడాల్సి వస్తోంది. వాస్తవికత కోసం ఇంతగా వర్ణనలు రాస్తారనీ.. దీనిని "హిస్టీరికల్ రియలిజం" అని జేంస్ వుడ్ అన్నాడని ఎక్కడో చదివాను.

పుస్తకంలో తెలుగు భలే ఉంది. కొన్ని పదాల ప్రయోగం అందంగా గొప్పగా అనిపించింది.
అయితే చాలా ఎక్స్పెకేషన్స్ తో చదవడం వల్లా... ఏమో రీజన్ ఇంకా అర్ధం కాలేదు కానీ ఏదో డిజప్పాయింట్‌మెంట్.. 

అసలు రచయిత అవుట్‌లుక్ లోనే... అంటే ప్రపంచాన్ని స్వీకరించిన పద్ధతిలోనే, జీవితం పట్ల అతని దృక్పధం.. ( మనకి చూపించ ప్రయత్నించిన పద్ధతిని బట్టి నా అంచనా మాత్రమే సుమా)... వీటిల్లోనే నాకు ఏదో పేచీ కనిపించింది.

మొత్తానికి ఒక పుస్తకం చదవడం పూర్తికాకుండా ఇంత మధన పడ్డ సందర్భాలు నాకైతే లేవు.
నచ్చిందో నచ్చలేదో ఇంకా అర్ధం కాలేదు. మొత్తం చదివాక మళ్ళీ చెప్తా.


No comments