ఇదిగో ఇలా

ఇదిగో ఇలా 
చినుకు మొదలైన ప్రతీసారీ
నా దోసిలంతా ఖాళీ చేసి ఉంచుతాను
ఆకాశం చెపుతున్న కబుర్లని 
చల్లగా పట్టుకొస్తావని 
నీటి పూల పొట్లానివై 
నన్ను పరిమళాన నింపేస్తావని
ఇదిగో...
అటు మళ్ళి పోతున్న 
ఆ మెరుపు పరకల్ని 
ఇటు వైపు చిమ్ముకుంటూ 
నా వేలి కొనన 
నీటి ముత్యానివై 
నా మనసంచున 
తేమ వేదానివై 
ఒక రహస్య కంపనని 
నా మీద కప్పి వెళతావనీ..


No comments