ఫనా...
ఫనా...
ఇలా సముద్రం ముందు కూర్చున్నప్పుడల్లా..
ఒక ఇష్టమైన జ్ఞాపకం,
నిన్నూ నన్నూ కలిపి "మనం" చేసిన జ్ఞాపకం.
గుండె నుండి ప్రాణాన్ని తీసుకు పోయి నన్నిలా నీలో నిలబెట్టేసిన జ్ఞాపకం.
సముద్రం ముందు కూర్చుని ఇలా నీతో మాట్లాడడం ఎంత గొప్ప అనుభూతో తెలుసా నీకు!!
కన్నీటి ఉప్పదనం తనలోకి వెళ్తోందా...
తన కెరటాల చెమ్మదనం నాలోకి వస్తోందా!!!
ఏమో తెలీదు.
ఇప్పుడైతే సముద్రం.. నేనూ ఒకలానే ఉన్నాం. నాలో ఉన్న నువ్వు కూడా!! తీరానికి వెన్నెల్లాంటి నురుగు కౌగిలిని కానుకిస్తూ...
స్వఛ్చంగా పరవళ్ళు తొక్కుతున్న కెరటాలని చూస్తూ... అంతే స్వఛ్చంగా నీలో ఫనా ఐపోతూ.... హ్మ్మ్....
ఒక్క సారి ప్రేమలో ఫనా అయ్యి చూడమన్న మాట ఇప్పుడర్ధం అయింది.
మనల్ని మనం కోల్పోవడం.....
ఈ రోజు కోల్పోయాక చాలా స్పష్టంగా అర్ధం అయింది. ... ఏం గెలుచుకున్నానో

ఇక వెను తిరిగే ప్రసక్తే లేదు.
ఇదిగో ఇప్పుడు చూడు!!
ఏవైపు అడుగులేసినా నీలోకే చేరుకోవడం,
ఒకరి రెక్కలలో ఒకరం ఒదిగిపోతూ బేషరతుగా కట్టుకున్న రెల్లు దుబ్బుల పొదరిళ్ళలో
మరచిపోయిన ఊసులేవో తిరగబోసుకోవడం
కెరటాల్లోంచి తుళ్ళి పడుతున్న దాహాన్ని దోసిలి పట్టి గుండె నింపుకోవడం...
ఇంతకన్నా ఈ చిన్ని జీవితంలో కావాల్సింది ఏముంది నేస్తం

Post a Comment