పాతసమయాల చుట్టూఈ క్షణపు లోతుల్లోకి
ఒక్కసారి అలా అలా వెళ్లి చూడు
మదిపై నిన్నే శాశ్వతత్వం చేసుకున్న  
ధ్యానముద్రలో ఉంటారెవరో

నీ శ్వాసచే రాయబడ్డ పుస్తకమై
తన ఉనికిని
నీ నీడగా పదిల పరచుకుంటూ
చేతికి కాస్తంత మట్టిని రాసుకొచ్చి
నీ పాతసమయాల చుట్టూ  
పచ్చని పాదుగా అమర్చటం
తనకిష్టమైన వ్యాపకం

తను ప్రతిసృష్టించుకున్న నీలోకం తప్ప
తనకింకేమీ తెలియదు కూడా
నీ పరిపూర్ణ నవ్వుకోసం…
కన్నీరుగా మారటానికి
కాలంలో కరగిపోటానికీ  
తానెప్పుడూ సిద్ధమే

అనంతమంటే ఏమిటని అడిగిచూడు
తన సమాధానం
నువ్వే...


No comments