అనగనగా ఒక లోకంలో

అనగనగా ఒక లోకంలో 
మిణుగురు రెక్కల వెలుగుపుంతలో 
వెన్నెల మార్దవంతో కొత్తందం రాసుకున్న 
పచ్చాని పచ్చిక క్రింద 
వాన కడిగి వెళ్ళిన నేల ఉంది 
చూసావా నేస్తం!
అదే
నిన్నూ నన్నూ
ఎప్పటికీ దాచుకునే
గోరువెచ్చని చిరునామా

వచ్చేయ్ మరి..
రసాయన కార్ఖానాలకి
కాంక్రీట్ తివాచీలకీ
అంజలి ఘటించి
ప్రకృతిని పచ్చగా వెలిగించుకుందాం
రేపటి రోజుని మురిపెంగా లిఖించుకుందాం


No comments