మెలకువ సందర్భం

సాధారణంగా స్త్రీ వాదుల రచనలు అనగానే "ఫెమినిస్టు పాఠాలు చెప్పే పాత్రలు" అనే ఒక అపోహ చాలామందికి ఉంటుంది.. అయితే అందుకు ధీటైన సమాధానం Satyavati Kondaveeti రచనల్లో మనకు దొరుకుతుంది. ఆమె రచనల్లో పాత్రలు తన చేయి దాటి ఎప్పుడూ నడవవు.
కధ గాని పాత్రలు గానీ ఆమె ఎంపిక చేసుకున్న సిద్ధాంతాన్ని అనుసరించి ఆమె చెప్పిన మార్గంలోనే ప్రయాణిస్తాయి. 

కేవలం స్త్రీ ల గురించేకాక, సమాజం లో అన్ని సమస్యల గురించి వివిధ రకాల మనుష్యుల మధ్య వారి సంభందాల చుట్టూ అల్లిన భావజాలం తో చాలా స్పష్టం గా ఉంటాయి ఆమె రచనలు.
అలాంటి విశిష్టమైన విలక్షణమైన కధల సమాహారం... "మెలకువ సందర్భం " కధల సంపుటి. ప్రతీ మనిషి లోనూ నిద్రావస్థలో ఉన్న చైతన్యాన్ని ఒక బలమైన సంఘటనా సృష్టి ద్వారా తట్టి లేపి మెలకువ తెప్పించే ప్రయత్నమే ఈ "మెలకువ సందర్భం " కధల సంపుటి. ఈ సంకలంనంలో మొత్తం 12 కధలు ఉంటాయి. ప్రతీ కధలోనూ ఒకానొక సమకాలీన సమస్యని ప్రస్తావించి దానికి తనదైన శైలి లో పరిష్కార మార్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు సత్యవతి.


ఈ కధలు చదివేటప్పుడు, ఈ సంఘటనలన్నీ మన చుట్టూ రోజూ జరుగుతున్నవే అనిపిస్తుంది. అరే! మనం ఇలా ఎదిరించలేకపోయామే అనే సంఘర్షణ ప్రతీ ఒక్కరి లోనూ మొదలవుతుంది.


ముఖ్యం గా ప్రతీ కధనీ ముగుంచిన తీరు అద్భుతం గా ఉంటుంది. ప్రతీ కధలో ముగింపూ మన ప్రతీ ఒక్కరిలో నిద్రాణం గా ఉన్న శక్తినీ తెగింపునీ నిద్ర లేపుతుంది. . సమాజం లో నేడున్న పరిస్థితుల్లో మన జీవితాలు బాగుచేసుకోవడమె కాదు. తోటి స్త్రీల బ్రతుకుల్లో కూడ ఆత్మవిశ్వాసం తొంగి చూడాలనీ.. అందుకు మనం అంతా ఏదో ఒకటి చెయాలనే తృష్ణ ను మనలో కలుగ చెసే ఈ కధలు ప్రతీ ఒక్కరూ చదివి తీరవలసినవి.



No comments