ప్రేమ పుట్టిన చోట
మన పాదాల పద జతులని కలవరిస్తూ
ఒక్కో యుగాన్ని స్వరపరుస్తూ
మరెప్పటికీ ముగియని పయనాన్ని లిఖిస్తూ
కంటి నీడల మౌన ముద్రల్లో
తేలిపోతున్న మెరుపుల ధ్వనిని ఆలకిస్తూ
ఆదమరస్తున్న శ్వాసలని
అలవాటుగా పట్టి ఉంచుతూ
తెరచి ఉన్న విముక్తిని
గుండెల్లోకి లాగేసుకుంటున్న
ఒక ఆప్త బంధంలో పట్టుబడి పోయి
మరింతగా బిగిసిపోతున్న
ఏకాంతపు ముడికి చిక్కుబడ్డ
నిశ్శబ్దం చుట్టూ కావలి కాస్తూ
నిన్ను చూడని నిన్నలో
ప్రేమ పుట్టిన చోట
నిలబడి ఉన్నాను ఇప్పుడు
ఒక్కో యుగాన్ని స్వరపరుస్తూ
మరెప్పటికీ ముగియని పయనాన్ని లిఖిస్తూ
కంటి నీడల మౌన ముద్రల్లో
తేలిపోతున్న మెరుపుల ధ్వనిని ఆలకిస్తూ
ఆదమరస్తున్న శ్వాసలని
అలవాటుగా పట్టి ఉంచుతూ
తెరచి ఉన్న విముక్తిని
గుండెల్లోకి లాగేసుకుంటున్న
ఒక ఆప్త బంధంలో పట్టుబడి పోయి
మరింతగా బిగిసిపోతున్న
ఏకాంతపు ముడికి చిక్కుబడ్డ
నిశ్శబ్దం చుట్టూ కావలి కాస్తూ
నిన్ను చూడని నిన్నలో
ప్రేమ పుట్టిన చోట
నిలబడి ఉన్నాను ఇప్పుడు
Post a Comment