దాగుంది చూడు అమ్మవడిలో
అమ్మకీ.. అమ్మ లాంటి అత్తయ్యకి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. వాళ్ళిద్దరికీ ఈ ప్లాట్‌ఫాం తెలీదు. ఆమాటకొస్తే నాకు తెలిసిన ప్రపంచంలో ఇప్పటికీ సెల్‌ఫోన్ లేని వాళ్ళు కూడా వాళ్లిద్దరే. అయినా వాళ్ల గురించి చెప్పాలనిపించి ఇక్కడ రాస్తున్నా.
‘దాగుంది చూడు అమ్మవడిలో...అన్ని ఋతువుల వసంతం’
నిజానికి అమ్మలందరూ ఇలానే ఉంటారు. ..
ప్రేమగా...
గొప్పగా...
ధైర్యంగా..
అంతకు మించి అందంగా...
అయినా కూడా ఎవరి జ్ఞాపకాలు వాళ్ళకే గొప్పగా అందంగా ఉంటాయి.
‘దాగుంది చూడు అమ్మవడిలో...అన్ని ఋతువుల వసంతం’
నిజానికి అమ్మలందరూ ఇలానే ఉంటారు. ..
ప్రేమగా...
గొప్పగా...
ధైర్యంగా..
అంతకు మించి అందంగా...
అయినా కూడా ఎవరి జ్ఞాపకాలు వాళ్ళకే గొప్పగా అందంగా ఉంటాయి.
అమ్మ సుజాత, అత్తయ్య స్వరాజ్య లక్ష్మి.
అమ్మ, అత్తయ్య... ఇప్పటిదాకా గడచిన మా ప్రయాణంలో ప్రతీ అడుగులోనూ వాళ్ళిచ్చిన ధైర్యం ఉంది. చిన్నప్పటినుంచి మా మీద వాళ్ళ ప్రభావం ఒక్క మాటలో చెప్పలేం. చిన్నప్పటినుంచీ అత్తయ్య ఎలా ?? అని ఆశ్చర్య పోకండి. తను మా మేనమామ భార్య. ఇప్పుడు అత్తయ్య.
ఇద్దరి గురించీ ఎంత చెప్పినా తక్కువే.
చిన్నప్పుడు నేను అక్కా చదువుకుంటుంటే అమ్మ కూడా మాతో పాటు తెల్లవారు ఝామున నిద్ర లేచేది. మా పక్కనే తనూ ఏ స్వెట్టరో షాలో అల్లుకుంటూ కూర్చునేది. మా చదువుకి కాపలా కాదు అది. ఒక ధైర్యం అంతే.
చిన్నప్పుడు నేను అక్కా చదువుకుంటుంటే అమ్మ కూడా మాతో పాటు తెల్లవారు ఝామున నిద్ర లేచేది. మా పక్కనే తనూ ఏ స్వెట్టరో షాలో అల్లుకుంటూ కూర్చునేది. మా చదువుకి కాపలా కాదు అది. ఒక ధైర్యం అంతే.
అమ్మ చదువుకున్నది అప్పట్లో టెంత్ క్లాస్. బహుశా కంప్లీట్ చేయలేదనుకుంటా. కాని తను చాలా షార్ప్. మాకు చాలా లెక్కలకి టిప్స్ అమ్మ చెప్పినవే.
టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, చుట్టుకొలతలూ, వైశాల్యాలూ.. ఈ లెక్కలకి అమ్మచెప్పిన షార్ట్ కట్స్ మనసుకి హత్తుకు పోయేటట్లు ఉండేవి. నాన్నగారు సరదాగా ఏడిపించేవారు.. " మీ అమ్మ ఇంకో తరగతి ఎక్కువ చదివి ఉంటేనా.." అని. నిజమే ఇప్పటికీ తన ఐక్యూ తో మమ్మల్ని ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది.

అమ్మ దగ్గర చాలా ఆర్ట్ ఉంది. రకరకాల వైర్లతో అందంగా బుట్టలు అల్లుతుంది. బోలెడు డిజైన్స్ తో స్వెటర్స్ అల్లుతుంది. ఇక ముగ్గు వేసిందంటే ఆ కర్వ్స్ వేసేటప్పుడే చూడాలి. మా చిన్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవడానికి అమ్మకి పెద్ద ఫాలోయింగ్ ఉండేది.
నేను అక్క.. ఈ రోజు ఇలా ఉన్నామంటే దాని వెనుక ప్రతీ క్షణం అమ్మ నీడ ఉంది.
ఇక అత్తయ్య...
ఒక్క మాటలో చెప్పాలంటే మా అమ్మని పెంచింది కూడా తనే. అమ్మ, పిన్ని చిన్నగా ఉన్నప్పుడే మామయ్యల పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో... దాదాపుగా అమ్మ వాళ్ళ చిన్నతనం మా అత్తయ్యతో, రాముడత్త (పెద్ద అత్తయ్య)తో గడిచింది.
అంత సహనం ఒక మనిషికి ఎలా సాధ్యమో నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే. అమ్మ, అత్తయ్య మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకచోట ఉన్నారంటే ఆ సంతోషం వాళ్ళ మొహాల్లో చూడాల్సిందే గాని మాటల్లో చెప్పలేం.
ధైర్యంగా తృప్తిగా హాయిగా... బిందాస్ గా వాళ్ళిద్దరూ గడిపే జీవితాన్ని చూస్తే చాలు వంద వ్యక్తిత్వ వికాశ పుస్తకాలు చదివినట్లే..
ధైర్యంగా తృప్తిగా హాయిగా... బిందాస్ గా వాళ్ళిద్దరూ గడిపే జీవితాన్ని చూస్తే చాలు వంద వ్యక్తిత్వ వికాశ పుస్తకాలు చదివినట్లే..
నాకు, అక్కకి, మా ఆడబడచుకే కాదు.. మా పిల్లలందరికీ కూడా అమ్మలైన వాళ్ళిద్దరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
Post a Comment