ఓ అమ్మాయీ ! ఒక్కటి గుర్తుంచుకో…

తూటాల్లాంటి మాటలు ఒక అరగంట వదిలాక ఒక్క క్షణం పాజ్ తీసుకుని, నివ్వెరపోయి చూస్తున్న ఆమెకు చివరి ముక్తాయింపు ఇచ్చాడతను.
"I don’t need your intelligentia... !!"
He don’t need my… 
పెదవి కొరుక్కుంటూ దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ అతని చాంబర్‌లోంచి బయటకు వచ్చిందామె.
“ These bloody women and tears, ... Shit ” మాటలు వినిపిస్తున్నాయి వెనక నుండి.
చిన్నప్పటి నుండి నేర్చుకున్న పాఠాలూ.., లెక్కలూ, ప్లస్ లూ , మైనస్ లూ.. గందరగోళ పరుస్తూ, నవ్వుతూ… వెక్కిరిస్తూ !
తారే జమీన్ పర్.!!
నువ్వేం బ్రతుకు బతికావ్ 
ఎక్కడ పుట్టావ్ 
ఎలా పెరిగావ్
ఏం చదివావ్ 
ఏం చేస్తున్నావ్ 
ఏమీ.. ఏమీ వద్దు
నీకు జలపాతంలా ఉరకడం తెలుసు 
అగ్ని కేతనంలా ఎగరడం తెలుసు 
మంచు బిందువులా జారిపోవడం తెలుసు 
వెన్నెల తుఫానై చుట్టుముట్టడం తెలుసు
ఇవన్నీ కాకపోతేనేం...
యూనివర్సిటీలో నీకొచ్చిన గోల్డుమెడల్ 
పోటీ పడి నువ్వు సాధించుకున్న ఉద్యోగం..
నీ వర్క్ రికార్డు
అన్నీ వదిలేయ్ !
Basically you are a woman
Ultimately you are a woman
No need of “ INTELLIGENTIA”
నువ్వో Super Woman అయినా…
అక్కడా ఇక్కడా గెలవడానికి నువ్వు పడుతున్న యాతనా, నీ కళ్ళ క్రింది నలుపూ ఇవేవీ అతన్ని కదిలించవ్…
బయటకి నిన్ను Madam అని పిలిచినా…
ఏమే..ఎమేమే.. అంటూ... సిరామిక్ వంపుల దగ్గరో, కుంచెల్లాంటి నీ కళ్ళ మర్మాన్ని కొలుస్తూనో, అచ్చోసిన హార్మోన్ల పియానో మీటుతూ, రహస్తంత్రీ నాదంలో, మోదం లో, వినోద వివాదాల్లో ఇరుక్కుని ఇకిలిస్తూ ఏడుస్తూ అతనొక పిచ్చివాడైపోతాడు.
అతని నాడీమండలంలో నిల్వ చేసిన RDX విస్ఫోటనంలో కేవలం నువ్వొక గాంధార శిల్పానివే. అంతకు మించి He needs no ‘INTELLIGENTIA’
అప్పుడు మరొకడు వస్తాడు. నీ చుట్టూ కొన్ని సాంత్వన వచనాలని పొగమంచులా పరిచేస్తూ..
ఆ పొగమంచును ఛేదించి చూడు…
తన కంఠంలో సాత్వికంగా జాలువారుతూ ఉన్న ఓ ఇంద్రజాలపు నిజాయితీ, కంటి నీడల వెనుక రంగులు మార్చుకుంటూ గర్వంగా నవ్వుకుంటూ ఉంటుంది నిన్ను స్త్రీ గానే గుర్తించే మరో పార్శ్వాన్ని ముందుకు తెచ్చానని.
సాంత్వనలోనూ నువ్వో ఆడదానివనే గుర్తు చేసే యుగయుగాల మగతనపు నిజాయితీ !!!
ఓ అమ్మాయీ ! ఒక్కటి గుర్తుంచుకో…
Ultimately you are a woman.
He is a man.
And..
You both together can never be.....

No comments