నీలిమ


నిశ్శబ్దాలన్నీ ఘనీభవించిన ఉనికిలో 
ఒంటరి ఊపిరొకటి 
ఉక్కబోతలో ఊయలూగుతున్నట్లుంది
కనురెప్పల మౌనం క్రిందుగా 
కల్లోల శబ్దపు రచన చేస్తున్న 
అశ్రు ఘంటంలో 
సింధువంత సిరా 
మిగిలి ఉన్నట్లే అనిపిస్తుంది
నీలిమ అంటే నాకిష్టమనుకుందేమో 
ఇంకాస్త నీలిమని గుండెల్లోకి జారుస్తూ 
వీడ్కోలు చెపుతుంది వెన్నెల గువ్వొకటి
ఇలాంటప్పుడే అనిపిస్తుంది 
మళ్ళీ ఒక్కసారి నిశ్శబ్దంలోకి 
జారి పడాలనీ 
కాసిన్ని సరికొత్త పదాలని రాసుకుని 
నీలిమ నుండి నీలి మంటలా ప్రజ్వరిల్లాలని

No comments