సర్ఫరోషికీ తమన్నా...

సర్ఫరోషికీ తమన్నా...
బుజ్దిలోంకో సదా మౌత్ సే డర్తే దేఖా,
గో కి సౌ బార్ ఇన్హే రోజ్ హీ మర్తే దేఖా
వీర్ కో హమ్‌నే నహీ మౌత్ సే డర్తే దేఖా,
తఖ్త్-ఎ-మౌత్ పర్ భీ ఖేల్ కర్‌తే దేఖా
".. భీరువులు ఎల్లప్పుడూ చావంటే భయపడడం చూశా,
అయినా ప్రతీ రోజూ వాళ్ళు వంద సార్లు చస్తూ ఉండడం చూశా
వీరులు చావంటే భయపడడం నేను చూడలేదు,
ఉరివేదికల పైన కూడా ఊయలలూగడం చూశా..."
90 ఏళ్ళ క్రితం ఇద్దరు యువకులు ఒకరు గీతనీ, మరొకరు ఖురాన్ నీ పఠిస్తూ ధీరులుగా ఉరికంబానికి నడిచిన స్మృతి. హిందూ ముస్లిం ఐక్యతని స్థాపించాలని వాళ్ళిచ్చిన ఆఖరి సందేశం...
ఏం పుస్తకం పంపావు వాసూ.. నిన్నటి నుంచి నాలో నేను లేను. మార్చి నెలలో పని రాక్షసిలా మారిపోయే నన్ను.. నిన్నటి నుంచి ఈ ప్రపంచం తో సంబంధం లేకుండా చదివేటట్లు చేసావు.
సర్ఫరోష్ కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై
దేఖ్‌నా హై జోర్ కిత్‌నా బాజు-ఎ-కాతిల్ మె హై
వక్త్ ఆనే పర్ బతా దేంగే తుఝే, ఏ ఆస్ మా,
హం అభీ సే క్యా బతాయే క్యా హమారే దిల్ మె హై.
ఇప్పుడింక ఏం చెప్పాలి. ఈ పుస్తకం రూపంలో అష్పాఖ్, బిస్మిల్ లు మార్చ్ 23 న నా మనసులో చేరడం వెనుక ఏదో డెస్టినీ ఉందనిపిస్తోంది.
అందుకే బిస్మిల్ ఇలా చెబుతున్నాడు.
నౌజవానో, జో తబీయత్ మే తుమ్హారీ ఖట్‌కే,
యాద్ కర్ లేనా కభీ హంకో భీ భూలే-భట్‌కే,
(నవ యువకులారా, మీ మనసు చెదిరిన వేళనైనా
గుర్తు చేసుకోండి మమ్మల్ని ఎప్పుడైనా పరాకునైనా.. )


No comments