మహి మ్యూజింగ్స్- 6
వచ్చే నెల ఇన్స్‌పెక్షన్ ప్రోగ్రాం గురించి మెయిల్ రాగానే వళ్ళు మండిపోయింది. మొన్నటికి మొన్న దాకా మార్చి యుద్ధం ఏప్రిల్ నెలాఖరుదాకా చేసామా... ఇలా ఊపిరి పీల్చుకొనేలేదు. అప్పుడే ఇన్స్‌పెక్షన్.
ఇప్పుడంటే ఇదిగో ఈ ఫైనాన్షియల్ సెక్టార్ లో చేరి, ఏప్రిల్ మే నెలల్లో నా జాతకం ఇలా తగలడింది గానీ.. చిన్నప్పుడు ఎండా కాలం వస్తే ఎంత బాగుండేది.!!
అసలు ఒంటిపూట స్కూల్ మొదలయిన దగ్గర్నించి మా హడావుడి కూడా మొదలయ్యేది. మధ్యాహ్నం ఎండన పడి ఇంటికి వస్తామేమో కాసేపు నిద్రపుచ్చాలని అమ్మ తాపత్రయ పడేది. మనం వింటామేంటి. నిద్ర ఎగ్గొట్టడానికి ఎన్ని వంకలు పెట్టాలో అన్నీ పెట్టే వాళ్ళం. ఆ కధలన్నీ ఒక చోట పేరిస్తే ఖచ్చితంగా ఒక పెద్ద పుస్తకం పబ్లిష్ చేయొచ్చు.
అసలు ఎండా కాలం అంటే నా మొదటి జ్ఞాపకం వడగళ్ళ వాన.
నాకు నాలుగేళ్ళు ఉంటాయేమో. బలిమెలా లో స్పిల్ వేలో ఉండేవాళ్ళం. ఒక మధ్యాహ్నం వడగళ్ళ వాన పడితే అవన్నీ ఏరుకుని చిన్న డబ్బాలో జాగ్రత్తగా దాచుకుని నిద్రపోయా. లేచేటప్పటికి వడగళ్ళన్నీ కరిగి నీరయిపోయాయి. అమ్మ పారేసిందని నాకు పేద్ద డౌటానుమానం.
ఎలా ఏడ్చానంటే..ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా నా ఏడుపు నా చెవుల్లో నాకే ప్రతిధ్వనిస్తుంది . నన్ను ఓదార్చలేక అమ్మ సతమతం అయిపోయింది.
చివరికి ఒక 15 రోజుల తర్వాత మళ్ళా వడగళ్ళు పడితే నాన్న గారు అవి పట్టి ఇచ్చి, కరిగిపోతాయని ప్రూవ్ చేసేవరకు, నా దృష్టిలో అమ్మ పెద్ద దోషి గానే ఉండిపోయింది.
వేసంకాలం బయట ఆటలు తక్కువే ఉండేవి. కృష్ణాయపాలెం వెళ్ళినా ఎక్కువ చింత పిక్కలూ, అష్టా చెమ్మా ఆడుకునే వాళ్ళం. చింత పిక్కలతో పాటు ఈత గింజలనూ కలిపి చింతపిక్కలాట ఆడుకునే వాళ్ళం. ప్రతీ వేసవి సెలవులకీ కృష్ణాయపాలెం వెళ్ళినప్పుడల్లా అమ్మమ్మ ఒక కొత్త పని నేర్పించేది. అప్పట్లో అవి కూడా ఆటల్లానే ఉండేవి. ఆ తర్వాత అర్ధం అయిందనుకోండి, ఎండలో తిరక్కుండా అమ్మమ్మ తీసుకునే జాగ్రత్త అని.
అలా నేర్చుకున్నదే ఇడ్లీ పప్పు రుబ్బడం. పొద్దున్న మినప్పప్పు నానబోసిన దగ్గర్నుంచి మా హడావుడి మొదలయ్యేది. మాటి మాటికీ గిన్నె దగ్గరకి వెళ్ళడం. పప్పుని పిసికి పిసికి చూడడం. పొట్టు ఊడుతుందా లేదా అని.
సాయంత్రం నాలుగవ్వగానే మాకు ఒక చిన్న బక్కెట్టు, ఒక గిన్నె ఇచ్చి కూర్చో పెట్టేది అమ్మమ్మ. పప్పు నానేసిన గిన్నెని కొంచం వారంపుగ పెట్టి అరచేయి నీళ్ళ పై పైన అలా అలా తిప్పుతుంటే మినప పొట్టు వచ్చేయాలి. మన చేయి ఏ మాత్రం లోతుకి వెళ్ళినా పొట్టు తో పాటు పప్పు వచ్చేస్తుంది.. అదొక సైంటిఫిక్ ఆపరేషన్ లా అనిపించేది.
ఇంక కడగడం అయ్యాక, రుబ్బడం. రోట్లో వేసి రుబ్బడం భలే ఉండేది. కొంచం కొంచం ఆరారగా నీళ్ళుపోస్తూ... మెత్తటి నురగ వచ్చేవరకు రుబ్బాలి. ఇడ్లీ పిండి ఎప్పడు అవుతుందంటే... మన పిండి నురగ నురగగా వచ్చినప్పుడు చేతితో పట్టుకుని ఊదామనుకొండి.. బెలూన్ లా గాలిలో ఎగరాలన్న మాట.
ఇంత విపులంగా చెప్పాక మనం టెస్ట్ చేయకుండా ఉంటామా చెప్పండి. పిండి మెత్తబడిన దగ్గర్నించి ఒకటే ఊదడం.
మర్నాడు అమ్మమ్మ ఇడ్లీ వేస్తే మామయ్యలు ఇంత ఎత్తు ఎగిరే వాళ్ళు ఇందులో పప్పు ఏదమ్మా అంతా రవ్వ మయం అని.మేం ఆడుకున్న బెలూన్ ఆటకి పిండి సగం పైగా ఖాళీ అయ్యేది. ఒక్క పని కాదు. మామయ్యలు నూతిలో నీళ్ళు తోడితే చిన్న చిన్న బక్కెట్లు పట్టుకుని గాబులు మొత్తం నింపేసే వాళ్ళం.
పనులే ఆటల్లా చేసే వాళ్ళమో, ఆటలనే పెద్ద పనిలా ఆడే వాళ్ళమో తెలీదు గాని.. ఇప్పుడు గుర్తోస్తే అదో గొప్ప అనుభూతి.
అప్పటి రోజులతో పోలిస్తే ఇప్పుడు రోజుకి ఏడెనిమిది గంటల పని,
దానికి తగిన ఘనమైన జీతం,
కోరుకున్న సౌకర్యాలున్న జీవితం ..
అన్నీ ఉన్నా ఏదో వెలితి.
ఏదో నిస్సత్తువ
ఒకలాంటి యాంత్రికత.
తెలీని నిరాసక్తత.
అర్ధంలేని వత్తిడీ.. గమ్యం లేని పరుగులూ..
బహుశా అప్పట్లో ... అది జీవించడమూ..
ఇది బతకడమూనా???

Post a Comment