The Apology of Socrates!!

The Apology of Socrates!!


Wise and otherwise...



"If You are a wise man, then you were a fool, If you are a fool, then you were a wise man."



ప్రముఖ తత్వవేత్త సోక్రటీస్‌ని ఒక రోజు ఓ శిష్యుడు ఇలా అడిగాడట.. "మేం ఇన్ని సంవాదాలు చేస్తూ ఉంటాము కదా.. మీరు వేటికీ నోరు తెరవకుండా ఉండడం మంచిదా.. చెడ్డదా..."



సోక్రటీస్ ఇలా సమాధానం చెప్పాడట.



"If You are a wise man, then you were a fool, If you are a fool, then you were a wise man."



"నీవు కనుక విజ్ఞుడవైతే, ఆలోచనాపరుడివి అయినట్లయితే, నీ ఆలోచన వల్ల పదిమందికీ మంచి చేసే అవకాశం ఉంటే ఆ ఆలోచనను అందరికీ పంచకుండా ఉన్నందుకు నీవు ఓ మూర్ఖుడివి. అలా కాక నీవు స్వతహాగా మూర్ఖుడివైతే నీ మాటల వల్ల, ఆలోచనల వల్ల పదిమందికి ఏ ప్రయోజనమూ సిద్ధించే అవకాశం లేనట్లయితే నీ మూర్ఖత్వాన్ని నీలో దాచుకున్నందుకు నీవు తెలివిగలవాడివి అని అర్ధం...



భలే ఉంది కదా. మూడు రోజుల నుంచి ప్లేటో రచనలు చదువుతున్నా. " ది అపాలజీ ఆఫ్ సోక్రటీస్ " చదువుతుంటే మనసు కన్నీరయిపోతోంది. మదిలో చెలరేగిన భావాలను తాత్వికంగా ఆయన చెప్పడానికి చేసిన ప్రయత్నానికి ఆయనకు మరణ శిక్ష విధించబడింది. 



ప్రజాస్వామ్యాన్ని ఎంతగానో ప్రేమించామని చెప్పుకునే రిపబ్లికన్ సమాజాల్లో కూడా..స్వేచ్ఛకి, ఆలోచనలకి... కుహనా సంప్రదాయ వాదులనుంచి ఎంతటి ప్రమాదం పొంచి ఉంటుందో సోక్రటీస్ జీవితం.. ఆయన బలవన్మరణం మనకి చాటి చెప్తాయి. 



స్వేచ్ఛా కాముకులకు సోక్రటీస్ జీవితం శాశ్వత ఆదర్శం.


No comments