సికాడా పురుగుల కధ

కాలువ వొడ్డున ఈ మర్రిచెట్టు జ్ఞాపకం ఉందా... 
ఎలా గడిపాం ఆ రోజులు. ఎలాంటి భయాలు.. ఇన్‌హిబిషన్స్ లేకుండా.
అసలు నువ్వున్నప్పుడంతా అలాగే ఉంటుందని తెలుసా నీకు.
చంద మామ కధల నుంచి..
చలం ప్రేమ లేఖల దాకా ఎన్ని మాటలు చెప్పుకున్నాం.
నువ్వు చెప్పిన సికాడా పురుగుల కధ!
కీచురాళ్ళు వినిపించినప్పుడల్లా.. ఒక చిరునవ్వు మొలకెత్తే జ్ఞాపకం.
అవునూ...
సికాడా పురుగుల్లాగే.. ఇప్పుడొక సుదీర్ఘ శైశవ దశ గడపాలని ఉంది.
హటాత్తుగా వాటిలాగానే ఒక్క కుదుపులో ఈ అర్ధ చేతన వీడి స్వేచ్ఛగా ఎగరాలనీ ఉంది.
ఏమో..
నువ్వూ, చలం ఇద్దరూ ఒక్కటే నాకు.
ఆశ పడడంలో బాధ ఉందని అందరూ అంటారు గానీ...
బాధ పడడంలోనే ఆశ ఉందంటాడు చలం.
ఎంత గొప్ప మాట కదా.
ఆశ పడుతూనే ఉంటాను.
గీతాంజలి గుర్తొస్తోంది.
"బీద అనాధ బాలికని ఇట్లా నీడలో కూచుని కాచుకుని ఉంటాను. రోడ్డుపక్కన చెట్లనీడల వెనక కనపడక దాక్కుంటావు నువ్వు...


No comments