శబ్దం
నువ్వొస్తున్నావు…
త్వరలోనే వస్తున్నావని సముద్రం చెప్తోంది.
అవిగో ఆ అలలు చూడు
నావేపు...ఎలా వస్తున్నాయో సంతోషంతో..
నీ రాక ముందే తెలిసింది కాబోలు…
గాలి చల చల్లగా మెత్తగా తాకుతోంది నన్ను.
లేకపోతే ఇంత మాధుర్యమెక్కడిదీ ఈ సముద్రపు గాలికి!!!
ఈ సముద్రంలో మళ్ళీ ఈతలు కొట్టి..
ఇసుక మీద గూళ్ళు కట్టుకుంటూ..
అంతులేని కబుర్లు చెప్పుకుంటూ…
అసలు జీవితం ఎంత అందంగా ఉంటుందో తెలుసా నీకు!!
కుంకుమపూల పుప్పొడిని స్వరపరుస్తున్న సాంధ్యావర్ణపు నీడలో
ప్రశాంతంగా కూర్చుని జమీల్యా చదువుకుంటున్నా…
జమీల్యా... దనియార్..
ఎంత ఉన్నతమైన ప్రేమ!
మనో ఆకాశం నుండి కుండపోతగా కురుస్తున్న స్మృతులు
గరికలుగా గాలివాటుకి ఎదురొడ్డి పల్లవిస్తూ
కునికిపాట్లు పడుతున్న మైదానాన్ని మేల్కొలుపుతున్న పాటలా
దనియార్‌ని తలుచుకున్నపుడల్లా నువ్వే గుర్తు వస్తావు
అతని గంభీరత్వాన్ని చూసినప్పుడు
నా జీవనం, బాధ, ప్రేమ చాలా అల్పం అనిపిస్తుంది.
ఇదిగో ఇలా దృష్టి ఇటు వైపు మళ్ళగానే
నేను.. నా బాధ తప్ప ప్రపంచమే లేదనిపిస్తుంది.
ఆ బాధని అలా పక్కకి నెట్టి ఇటు చూశానా
అర్ధ చంద్రుడు రావి చెట్టు కొమ్మల్తో దాగుడు మూతలాడుకుంటున్నాడు.
ఒక వేపు చంద్రుడు... మరో వైపు నిశ్చలంగా వెలుగుతున్న నక్షత్రాలు!
నా చుట్టూ అంతా నిశ్శబ్దం…
అంతా నీ శబ్దం
అవును ఇక జీవితమంతా నీ శబ్దమే

Post a Comment