కార్తీకం

పౌర్ణమిని కప్పుకొచ్చిందో కార్తీకం 
శరత్కాలపు చల్లదనాన్ని వడగట్టుకుంటూ ! 
అచ్చంగా 
తన చిరునవ్వు నా పెదవులపై వాలినట్లుగా 
అప్పుడే 
వెన్నెల గోదావరి వన్నెల కుంతలాలపై
తననీ నన్నూ తురుముకుంది ఓ ఏకాంతం
ఇసుక మేడల్లో మా పసితనాన్ని మళ్ళీ వసంతిస్తూ
కొమ్మ కొమ్మనా పూసిన వెన్నల పువ్వు ని ఆఘ్రాణిస్తూ
చినుకు చినుకులో రాలిన కర్పూర గంధాన్ని పూసుకుంటూ
తూర్పు బాలిక రెప్పలిప్పేవరకూ
కార్తీకపు కౌముది కిన్నెరనాదంలో పల్లవిస్తూ



No comments