Feeling positive for negative

పుట్టిన క్షణం లోనే కౌంట్ డౌన్ మొదలవుతుందని అందరికీ తెలుసు. అయినా  మరణమంటే అందరికీ భయమే. ఏదో ఒక రోజు పోతామని తెలిసినా, మరణం ఇదిగో రూపంలో వస్తుందనే ఊహ ఉంటుంది చూసారూ అది మరణాన్ని మించిన భయానకం. అసలైన మరణం అంటే అదే అనిపిస్తుంది.

చితి చనిపోయాక కాలుస్తుంది. కానీ చింత ఉందే అది బ్రతికున్న ప్రతి క్షణాన్ని కాలుస్తుంది. మనిషికి బ్రతుకులోనే చావును పరిచయం చేస్తూ ప్రత్యక్ష నరకాన్ని చూపుతుంది. మనసంతా బడబాగ్నిలా వేదనని రగిలిస్తుంటేజీవితం మరిన్ని వసంతాలని పరిచయం చేస్తూ ఆశలు కల్పిస్తుంటే ఇప్పటికిప్పుడు మరణం పరమ శత్రువే కదూ.  

అబ్బాజీవితం పరమ బోర్ గా ఉంది' అనో, జీవితంలో  థ్రిల్ లేదనో లేదా చిన్న చిన్న సమస్యలకి జీవితం మీద ఆశల్ని కోల్పోయే వాళ్లకో ఒక్క సారిఒకే ఒక్కసారి చావు పీడకల వెంటాడే వాళ్ళని చూపించాలి.

జీవితంలో ప్రతిదీ పాజిటివ్... పాజిటివ్ గా ఉండాలని చెప్పుకుంటాం. ప్రతి పనిలో పాజిటివ్ రిజల్ట్ నే కోరుకుంటాం. కానీ కొన్ని సార్లు పాజిటివ్ రాకూడదు అని కోరుకోవటం ఉంది చూశారూఅది మాత్రం నెగటివ్ కాదు కదూ. అవును నిజమే… ‘ఇది పాజిటివ్ కాకూడదునెగెటివ్ రావాలి' అన్న కోరిక తొలిచేస్తున్నప్పుడే అర్థం అవుతుంది. అప్పుడప్పుడూ నెగెటివ్కూడా పాజిటివ్ గా మనల్ని నడిపిస్తుందని.    

అత్తమామలు... ఆడపడచు
సహచరుడు... బంగారం లాంటి పిల్లాడు
ఆఫీసు బాస్... పక్కింటి స్నేహితురాలు
అందరి విషయంలో
థింక్ పాజిటివ్
బి పాజిటివ్
ఆఖరికి రక్తంలో కూడా...  
యూనివర్సల్  బ్లడ్ డోనార్ అంటే పాజిటివ్
కాని... ఎప్పుడూ... కొన్ని  టెస్ట్ లు మాత్రం
నెగటివ్ రావాలని కోరుకుంటాం
హమ్మయ్య... సారికి గెలిచా అనుకుంటాం
మళ్ళీ మళ్ళీ ఇవే పరీక్షలు....
నిలువెల్లా పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్
అలవాటయ్యింది కదా...
నెగెటివ్ వస్తుందన్న పాజిటివ్ థింకింగ్....
నిజం
ఇది పాజిటివ్ ... నెగెటివ్’…

No comments