ఎవరు?

"ఎవరు?"
అన్న ఒక ప్రశ్న తత్వ శాస్త్రానికి మూలమయ్యింది. 
"
ఎందుకు?"
అన్న ఒక ప్రశ్న ఆవిష్కరణలకు బీజమయ్యింది. 
"
ఎలా?"
అన్న ఒక ప్రశ్న సముద్ర యాత్రలకు., అంతరిక్ష అన్వేషణలకు కారణమయ్యింది.
"
ఏమిటి?"
అన్న ఒక ప్రశ్న విప్లవాలకు ఊతమిచ్చింది. ప్రశ్నే లేకపోతే మానవ జాతి మనుగడే లేదు. న్యూటన్ ప్రశ్నించకపోతే , ఎడిసన్ ప్రశ్నించకపోతే, మహాత్ముడు ప్రశ్నించకపోతే, చేగువేరా ప్రశ్నించకపోతే ప్రపంచ చరిత్ర మరోలా ఉండేది. ఇంకోలా చదువుకొనే వాళ్ళం. ప్రశ్నకు దూరం గా ఉన్నవారు అజ్ఞానం లోనే మిగిలి పోతారు. ప్రశ్నించే ధైర్యం ఉన్నవారికే, ప్రశ్నించాలన్న వివేకం ఉన్నవారికే, ప్రశ్నను సృష్టించగల సత్యాన్వేషికే ఎప్పటికయినా జవాబు దొరుకుతుంది. ప్రశ్న పదునుగా ఉండాలి. అప్పుడే గురి తప్పకుండా లక్ష్యాన్ని చేరుతుంది. రాల్చాన్సినవి రాల్చేస్తుంది. కూల్చాల్సినవి కూల్చేస్తుంది. మన హక్కులేంటొ చెపుతుంది.


No comments