ఆమె!!
గాయాల కొలిమిలో
తన ధైర్యాన్ని ఒంపి
వెలుతురు నక్షత్రాల్ని
పూయిస్తుంది!
కొండంత గుండె నిబ్బరంతో
హిమవత్పర్వతంలా మన ముందు
నిలబడుతుంది!
హిమవత్పర్వతంలా మన ముందు
నిలబడుతుంది!
కాలం విసిరిన చీకట్లలో
వెలుగు రేఖై దూసుకుపోతుంది!
వెలుగు రేఖై దూసుకుపోతుంది!
విధి ఎత్తుగడను సమాధి చేసి
జీవితపు తూర్పు వాకిట్లో
ధిక్కార పతకాన్నెగురవేస్తుంది!
జీవితపు తూర్పు వాకిట్లో
ధిక్కార పతకాన్నెగురవేస్తుంది!
అందుకే దైవమనేది
ఆ చుట్టు పక్కలెక్కడైనా ఉంటే
ఆమె కనిపించినప్పుడల్లా
తన అజ్ఞానపు కలుగులోకి
ముడుచుకు పోతుంది.
ఒక పశ్చాత్తపు గదిలోకి
కదిలిపోతుంది.
ఆ చుట్టు పక్కలెక్కడైనా ఉంటే
ఆమె కనిపించినప్పుడల్లా
తన అజ్ఞానపు కలుగులోకి
ముడుచుకు పోతుంది.
ఒక పశ్చాత్తపు గదిలోకి
కదిలిపోతుంది.
Post a Comment