పుస్తకాలు.!!
ఈ మధ్య FB లో మంచి Concept నడుస్తోంది. ఇష్టమైన బుక్స్ చెప్పి. ఒక ఫ్రెండ్ కి చాలెంజ్ ఇవ్వడం. ఈ Concept చాలా నచ్చింది నాకు.
నేను చదివిన పుస్తకాలు.. నా చుట్టూ మనుష్యులు అందరి దగ్గరా నేను చాలా నేర్చుకున్నా. మంచి అయితే నేర్చుకోవడం.. చెడు అయితే.. అలా ఉండకూడదుఅనుకోవడం. చిన్నప్పుడు చదివిన చందమామల దగ్గర్నించి ఇప్పుడు చదువుతున్న కాఫ్కా కధల వరకు అన్నీ ఎంతో నేర్పించినవే.
ఎలాంటి పుస్తకాలు చదవాలి?? అని మాత్రం నేను ఎప్పటికీ ఎవరికీ సజెస్ట్ చేయలేను ఎందుకంటే.. మన మన పరిస్థితులను బట్టి, కాలమాన స్థితులను బట్టి ఒక్కోసారి ఒక్కో పుస్తకం, ఒక్కో రచయితా మనల్ని చాలా ప్రభావితం చేస్తారు.
“I think we ought to read only the kind of books that wound or stab us. If the book we're reading doesn't wake us up with a blow to the head, what are we reading for?.....
So that it will make us happy, as you write?
“మనల్ని గాయపరిచి,...
తూట్లు పొడిచే పుస్తకాలే మనం చదవాలి.
మన తల మీద మొట్టి నిద్ర లేపకపోతే
ఎందుకిక పుస్తకాలు చదవటం?
ఆనందం కోసమా!
అసలు పుస్తకాలు లేకపోయినా మనం ఆనందంగానే ఉండగలం, ఆనందపెట్టే పుస్తకాలు మనమే చిటికెలో రాయగలం.
నిజమైన పుస్తకాలు వేరు....
అవి ఒక విపత్తులా,
మనకన్నా ఎక్కువగా మనం ప్రేమించిన వారి చావులా,
అందరికీ దూరంగా అడవుల్లోకి వెలి వేయబడటంలా,
ఒక ఆత్మహత్యలా మనల్ని కదిలించాలి.
మనలో గడ్డకట్టుకుపోయిన సముద్రాలకి పుస్తకం ఒక గొడ్డలిపెట్టు కావాలి.”
అంటాడు ఫ్రాంజ్ కాఫ్కా.
అందరికీ అది నచ్చక పోవచ్చు. ఎందుకంటే చెప్పానుగా.. ఎవరి అభిరుచిని బట్టి అవసరాన్ని బట్టి పుస్తకాల ఎంపిక కూడా మారుతుంది .
నేనయితే నాకు దొరికిన ప్రతీ పుస్తకాన్ని ఎంజాయ్ చేస్తా. ఎక్కువసార్లు చదివిన పుస్తకం అయితే చిన్నప్పుడు Jeffrey Archer రాసిన "The First Among Equals. జెఫ్రీ ప్రేమలో కొట్టుకు పోతున్నప్పుడు ఆయన పుస్తకాలు విపరీతంగా చదివేదాన్ని. ఆ తర్వాత యూనివర్సిటీ లో దాదాపు ప్రతీ ఆదివారం కొన్ని పేజీలైనా తప్పని సరిగా చదివిన పుస్తకం Jean paul Sartre రాసిన Nausea. Existentialsm.. భలే అనిపించేది ఈ పదం వింటేనే.
అప్పటినుంచి ఇప్పటి వరకూ... ఎన్ని పుస్తకాలు.!! ఎన్ని పాఠాలు.!!!
ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం చాలా చదివేసానన్న అమాయకత్వం నుంచి..
చదవాల్సింది చాలా ఉందన్న వాస్తవం తెలుసుకున్న ఈ రోజు వరకూ...

Post a Comment