#IAmACrier

Yes!! I Am A Crier
But Remember,
My Tears don't compromise my strength
I am a crier… So of course what?
I can cry out of being hurt…
being upset…
being saddened
And
Of course I cry because my heart crying.
అవును కన్నీళ్లు మనకేం కొత్త కాదు. 
ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు తుడుచుకున్న ప్రతిసారీ అది చివరిదన్న ధైర్యమూ లేదు. అయినా ఏడుస్తాం. ఏడ్చి తెరిపి పడిన ప్రతి సారీ కొత్త ధైర్యంతో ముందుకు వెళ్తాం.
We cry because our hearts are crying.
మనసు ఏడుస్తున్నప్పడు పైకి నవ్వడం ఎలా సాధ్యం?
అయినా, 
అసలు ఏ ఆడపిల్లకి ఏడవనవసరం లేని జీవితం ఉందో చెప్పండి. 8 నెలల పసిపాపలనీ వదలని సొసైటీ లో కన్నీళ్లు ఊరక ఏం చేస్తాయి. ఇవి మా కన్నీళ్లు… మాకు మాత్రమే అర్థమయ్యే కన్నీళ్లు. అమ్మ పొత్తిళ్ళ నుండి అంపశయ్య వరకూ సున్నితమైన మనసు తోడుగా తెచ్చుకునే నీటి నేస్తాలు ఈ తడి ముత్యాలు.
కన్నీళ్ళంటే బాధలో వచ్చేవి కాదు. బాధని కడిగెయ్యటానికి వచ్చే స్వచ్ఛతా సింధువులు.
సానుభూతికోసం పక్కవాళ్ళకి ప్రదర్శించటానికి తెచ్చుకునేవి కావు కన్నీళ్ళంటే… మనసు పొరల్లో కొట్టుమిట్టాడుతున్న కొన్ని ఎమోషన్స్ ని తడి వరదగా వెళ్లగక్కుకుంటున్న Out lets.
మన కన్నీళ్లు మన బలహీనత అని ఎప్పుడూ అనుకోవద్దు. గుండెల్లో కదలాడే తడి, మనలోని సున్నితత్వానికి ఒక సూచన. మనల్ని మనలోకి చల్లబరిచే ఒక ఉత్ప్రేరకం. మనం ఏ సంఘటనకైనా ఒక్క సారే కన్నీళ్లు పెడతాము. అటుపై మన లోలోపలి నుండి ఒక అంతర్గత శక్తి బయటకు వచ్చి మన చెక్కిళ్ళపై కారే కన్నీటిని తుడిచేస్తుంది.
ఒక్క సారి ఊహించి చూడండి. ఆ ఒక్క క్షణం ఇచ్చే శక్తి మనల్ని మరింత బలంగా… మరింత ధైర్యంగా ముందుకు నడిపిస్తుంది.. అవును కన్నీళ్లంటే మనిషిని మనిషిగా కొనసాగించే తడి ఇంధనం.
లక్ష మాటలు ఊరడించలేని మనసుని ఒక్క కన్నీటి బొట్టు ఊరడిస్తుంది. అసలు కన్నీళ్లే లేకపోతే మనకీ రోబోట్స్ కి తేడా ఏముంటుంది.
Tears from our emotions are nothing but Natural Pain killers 
Tears are natural Antidotes for Painful Hearts.
So…
Remember!!
our tears will never compromise our strength.


No comments